Monday, December 23, 2024

సుశీ ఇన్‌ఫ్రాలో జిఎస్టీ అధికారుల సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదారబాద్: బంజారాహిల్స్‌లోని సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ సంస్థలో రాష్ట్ర జిఎస్టీ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. 25 బృందాలతో సుమారు 150 మంది అధికారులు ఉదయం 11 గంటల నుంచి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ సంస్థకు బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. సుశీ ఇన్‌ఫ్రా ప్రధాన కార్యాలయంతోపాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లపైన కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఎన్నికలప్పుడు ఈ సంస్థ నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెరాస ఆరోపణ చేసింది. లావాదేవీలకు సంబంధించిన జాబితాను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అయితే ఎన్నికల కమిషన్ వాటిని సుశీ ఇన్‌ఫ్రా లావాదేవీలుగానే తేల్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ తాజా సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. మంగళవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.

State GST raids on Sushee Infra

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News