Monday, November 18, 2024

బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షం

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట: పరిపాలన సౌలభ్యం కోసం దేశంలోనే ఆదర్శనీయంగా పాలన సేవలు సులభతరం చేయడానికి జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శనివారం అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపిపి మాలోతు లక్ష్మీ బీలు నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించడానికి పాలన పారదర్శకంగా ఉండడానికి సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిపాలన సంస్కరణలు తెలంగాణలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో సత్వర అభివృద్ధికి గొప్ప చోదక శక్తిగా పనిచేశారని కొనియాడారు.

32 గ్రామాలతో అక్కన్నపేటను నూతన మండలంగా ఏర్పాటు చేసుకొని అన్నిరంగాల్లో సంక్షేమ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామన్నారు. పరిపాలన సౌలభ్యం ప్రజా ప్రయోజనాల కోసం తండాలను సైతం గ్రామపంచాయతీలుగా చేసి ప్రత్యేక నిధులను మంజూరుతో అభివృద్ధి చేస్తున్నామని ప్రతి గ్రామానికి, తండాలకు మిషన్ భగీరథ నీరు, మిషన్ కాకతీయ పనులు, రోడ్డు నిర్మాణాలు, పోలీస్ స్టేషన్ భవనం ఏర్పాటు చేసుకున్నామన్నారు. రైతుల సౌలభ్యం కోసం అక్కన్నపేట మండలానికి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ అనుబంధంతో మార్కెట్ 9.20 ఎకరాలతో సబ్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ భవనం కోసం ఐదు ఎకరాలు కూడా కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, జడ్పిటిసి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎంపిటిసి పెసరు సాంబరాజు, సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, ఎంపిడిఓ సత్యపాల్ రెడ్డిలతోపాటు వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News