Monday, December 23, 2024

మొగుడంపల్లి జీపికి ఉత్తమ అవార్డు

- Advertisement -
- Advertisement -

మొగుడంపల్లి ః పచ్చదనంలో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినట్లు ఎంపీడీఓ మహేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈసందర్బంగా గ్రామాభివృద్దికి గ్రామస్తుల సహకారంతోనే గ్రామ పంచాయతీకి అవార్డు లభించిందని గ్రామ సర్పంచ్ పట్లోళ్ల సుగుణమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేశ్ గౌడ్‌లు తెలిపారు. గ్రామంలో 14వార్డులకు గాను 10వేల జనాభా గల మొగుడంపల్లిలో నాలుగేళ్లల్లో ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను 100శాతం పూర్తి చేసినట్లుతెలిపారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో సీఎం కేసీఆర్, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సమక్షంలో అవార్డుఅందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లా నుంచి ఏకైక ఉత్తమ పచ్చదన గ్రామ పంచాయతీగా మొగుడంపల్లి గ్రామ పంచాయతీ ఎంపిక కావడం సంతోషంగా ఉందని గ్రామ సర్పంచ్ సుగుణమ్మ, పంచాయతీ కార్యదర్శి మల్లేశ్ గౌడ్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News