Friday, November 22, 2024

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : అడవులకు పునర్జీవం పోయడం, ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణ మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హరితహారం కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవా రం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 7వ డివిజన్ తీగల వంతెన వద్ద హరిత దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లుగా భావించి ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యంగా జులై 3, 2015 సంవత్సరంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కోట్లాది మొక్కలు నాటి సంరక్షించడంతో పచ్చదనం ఫరిఢ విల్లుతున్నదని అన్నారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పా టు చేసి పచ్చదనం పెంచడం జరుగుతుందన్నారు. 2023 సంవత్సరంలో జిల్లాలో 9వ విడత హరితహారం కార్యక్రమంలో 44 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్వహించడం జరిగిందన్నారు. సోమవారం ఒకే రోజు 6లక్షల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టడం జరిగింద న్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుకు లక్షలాది మొక్కలు నాటి భావితారాలకు అందివ్వాలని మంత్రి తెలిపారు.
మంత్రి కెటిఆర్ పర్యటన విజయవంతం చేయాలిః
ఈ నెల 21న రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ కేబుల్ బ్రిడ్జి ను ప్రారంభించనున్నారని ఇట్టి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని మంత్రి కోరారు. మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది పనుల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, డి ఈ మాసూద్, కార్పొరేటర్లు ఆకుల పద్మ ప్రకాష్, కోల మాలతి సంపత్, ప్రజా ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News