Monday, December 23, 2024

నీటి సమృద్ధి కేటగిరిలో మజీద్‌పూర్‌కు రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: గ్రామంలో నీటి సమృద్ది కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతిని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్ గ్రామ పంచాయతీకి దక్కింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్నవాల్లో భాగంగా రవీంద్ర భారతిలో జరిగిన పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలో సర్పంచ్ పోచంపల్లి సుధాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జమీల్‌కి మంత్రులు దయాకర్‌రావు, జగదీశరెడ్డి, సిఎస్ శాంతికుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ పంచాయతీరాజ్ సందీప్ కుమార్, పంచాయతీ రాజ్ కమీషనర్ హనుమంతరావులతో కలిసి బహుమతి, సర్టిపికెట్‌ను బహుకరించి అభినందించారు. ఈ సందర్బంగా సర్పంచ్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీ అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నామని, రాష్ట్ర స్థాయిలో గుర్తుంపు లభించటం సంతోషకరంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News