Thursday, January 23, 2025

సత్తుపల్లి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో టిఎస్ బి పాస్ అవార్డు

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు సందర్భంగా రాష్ట్రస్థాయిలో 8 విభాగాల్లో ఉత్తమ అవార్డులు అందజేయగా భవన నిర్మాణ అనుమతుల మంజూరులో సత్తుపల్లి మునిపాలిటీకి టీఎస్ బీ పాస్ అవార్డు రాష్ట్ర ప్రభుత్వంచే లభించడం పట్ల సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి పురపాలక సంఘానికి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్లో పట్టణ ప్రగతి దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ సత్యనారాయణ చేతుల మీదుగా సత్తుపల్లి పురపాలక సంఘానికి అవార్డు ప్రదానం చేయగా ఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మున్సిపల్ కమిషనర్ సుజాతలను సన్మానించి అవార్డును అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సమిష్ఠ కృషితో రాష్ట్రస్థాయిలో టి ఎస్ బి పాస్ ఉత్తమ అవార్డు పొందినందున పురపాలక సంఘం కౌన్సిలర్లకు, అధికార సిబ్బందికు, తదితరులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుభాకాంక్షలు తెలిపారు.

రానున్న రోజుల్లో మున్సిపాలిటీకి మరెన్నో అవార్డులు లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరావు, కౌన్సిలర్లు దేవరపల్లి ప్రవీణ్, షేక్ చాంద్ పాషా అద్దంకి అనిల్, గుండ్రా రఘు, షేక్ నాగుల్ మీరా, నాయకులు నారుకుల్ల శ్రీను, వేములపల్లి మధు, ఘఫార్ ఖాన్, కంటే అప్పారావు, నడ్డి ఆనందరావు, సిబ్బంది తదితులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News