Monday, December 23, 2024

దక్షిణ కొరియాలో మ్యూజికల్ ఫౌంటెన్‌ను సందర్శించిన రాష్ట్ర మంత్రులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ కొరియా లోనీ యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మ్యూజికల్ ఫౌంటెన్ బి ఓ షోను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌లు పరిశీలించారు. సౌత్ కొరియా లోని యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అక్కడి బి ఓ షో మ్యూజికల్ ఫౌంటెన్ కంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మెరుగైన ఫౌంటెన్ ను కరీంనగర్ లోని మానేరు రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రులు బృందం వెల్లడించారు.

ఈ మ్యూజికల్ ఫౌంటెన్ ను పనితీరు అడిగి తెలుసుకున్న మంత్రులు ఆ ప్రాంతాన్ని కలిసి తిలకించారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్ తో పాటు వివిధ పట్టణాలలో ఆధునిక మ్యూజికల్ ఫౌంటైన్లను ఇన్ స్టాల్ చేయడానికి పరిశీలిస్తున్నామని, దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాల పనితీరు అక్కడి సాంకేతికతను అందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని వారు ఈ సందర్భంగా వెల్లడించారు. అక్కడ అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, సిఎం కెసిఆర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో పర్యాటశాఖ ఆధ్వర్యంలో వివిధ పట్టణాల్లో ఉన్నటువంటి పర్యాట ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు .

విదేశీ పర్యాటకులు ఆకర్షించే లక్ష్యంగా రాష్ట్రంలో ఆధునిక పరిజ్ఞానంతో పనిచేసే మ్యూజికల్ ఫౌంటెన్ లు, జెయింట్ వీల్స్, వాటర్ స్పోర్ట్ లను కరీంనగర్ లోనీ మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. మహబుబ్ నగర్ లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ వేవ్ పూల్, వాటర్ రైడ్స్,వాటర్ స్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ వద్ద మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పర్యాటకులకు కనువిందు చేసేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడమే లక్ష్యంగా
రాష్ట్రంలో కొత్త కొత్త పర్యాటక ఆకర్షణలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో
నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి. కర్ణన్, పర్యాటక శాఖ ఎండి మనోహర్ లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News