Thursday, January 23, 2025

కంటి శస్త్ర చికిత్సకు అత్యాధునిక ఫాకో మిషన్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కంటి సమస్యలతో బాధపడే వారికి ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అధునాతన కంటి ఆపరేషన్ చేసే ఫాకో యంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆర్‌.వి. కర్ణన్ తెలిపారు.

బుధవారం ప్రభుత్వ ఆసుపత్రులలో అధునాతన పరికరాల ద్వారా కాంటరాక్టు ఆపరేషన్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఫాకో మిషన్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫాకో మిషన్ గురించి కలెక్టర్ వివరిస్తూ కంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలను అందించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలతో ఫాకో మిషన్‌లను అం దించిందన్నారు.

ఈ పరికరం ద్వారా కత్తిగాట్లు, పట్టిలు కట్టుకొని ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేకుండా చిన్నగాటుతో కంటి ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితాదేవి, హాస్పిటల్ సూపరింటెండెంట్ కృష్ణప్రసాద్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, అదనపు ఆర్‌ఎంవో నవీన, డాక్టర్ రత్నమాల, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News