Monday, January 27, 2025

రాష్ట్ర చరిత్రలో నిలిచేలా ప్రజా విజయోత్సవాలు

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్:  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కలెక్టరేట్ లో ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఎంఎల్ఏలు మధుసూదన్ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, మెగా రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  తర్వాత భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో ఈ నెల 28 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు సభకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం సంవత్సర కాలంలో సాధించిన విజయాలతో పాటు, మున్ముందు చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన రైతు సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News