Wednesday, January 22, 2025

రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని 30వ వార్డుకు చెందిన నజ్మిత అథెరుకు షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన లక్ష రూపాయల చెక్కును ఎంఎల్‌ఎ క్యాం పు కార్యాలయంలో సోమవారం అందజేశారు.

అనంతరం ఎంఎల్‌ఎ సంజయ్ మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి కెసిఆర్ కానుక షాదిముబారక్, కళ్యాణలక్ష్మి పథకం అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు పరిచే ప్రతి సంక్షేమ పథకాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

చెక్కుతో పాటు ఎంఎల్‌ఎ చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డు ఇంచార్జి, పట్టణ ఉపాధ్యక్షుడు దుమాల రాజ్‌కుమార్, ఎఎంసి వైస్ చైర్మన్ ఆసిఫ్, జమీల్, పట్టణ ఉపాధ్యక్షుడు ఒల్లెం మల్లేశం, బోనగిరి నారాయణ, తాజొద్దిన్, రాజు, జుంబర్తి శంకర్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News