Wednesday, January 22, 2025

12వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల (పాఠశాలలు, జూనియర్ కళాశాలల) బంద్ కు వామపక్ష యువజన సంఘాలు ఎఐవైఎఫ్, డివైఎఫ్‌ఐ, పివైఎల్, ఎఐఎఫ్‌డివై రాష్ట్ర కమిటీలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ,ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా వామపక్ష యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సమావేశం హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో బంద్‌కు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నిర్లకంటి శ్రీకాంత్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి సల్మాన్ బేగ్, టి. సత్య ప్రసాద్, డివైఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావీద్, పివైఎల్ రాష్ట్ర నేతలు రవి కుమార్, బి.కృష్ణ, బి.శ్రీనివాస్, రాజు, ఎఐఎఫ్‌డివై హైదరాబాద్ జిల్లా నేత మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News