- Advertisement -
తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డిజిపి రవిగుప్తా వెల్లడించారు. డ్రగ్స్ వినియోగించిన.. సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని డిజిపి రవిగుప్తా పిలుపునిచ్చారు. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలన్నారు. అదనపు డీజీ సీఐడీ మహేశ్ ఎం భగవత్, ఇతర అధికారుల సమక్షంలో ‘క్రైమ్ ఇన్ తెలంగాణ -2022’ పుస్తకాన్ని మంగళవారం తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా విడుదల చేశారు.
- Advertisement -