- Advertisement -
హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విచారణను అతని వినతి మేరకు ఈ నెల 18 తేదీకి అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించించి న రాష్ట్ర మహిళా కమిషన్ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. మార్చి 15న కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించగా
తనకు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో 15వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కాలేనని, ఈ నెల 18న కమిషన్ చైర్ పర్సన్ సూచించిన సమయానికి హాజరు అవుతానని బండి సంజయ్ లేఖలో అభ్యర్థించగా కమిషన్ అందుకు సానుకూలంగా స్పందించి 18న 11 గంటలకు హాజరు కావాలని సూచించింది. 18న హాజరు కాలేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసు ద్వారా మహిళా కమిషన్ హెచ్చరించింది.
- Advertisement -