Wednesday, January 22, 2025

రైతులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని, రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో ఏక మొత్తంలో 1180 కోట్లను ఈ ఒక్క రోజే రైతుల అకౌంట్లో జమ చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

శుక్రవారం ధాన్యంకొనుగోలుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలో 7030 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యంలో ఎప్పటికప్పుడు వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ వాటికి అనుగుణంగా రైతుల ఖాతాలకు నిధులను నేరుగా బదిలీ చేస్తున్నామన్నారు, సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతతో నిధుల్ని సమకూర్చుతుండడంతో వెంట వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామన్నారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News