Wednesday, January 22, 2025

బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం గల బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బిసి, ఎస్సీ,ఎస్టీ వర్గాల ప్రజలు రాయితీలు,సంక్షేమ పథకాలకు రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టిఎస్‌పిఎస్సీ కమీషన్ ను రద్దు చేసి, కొత్త కమీషన్‌ను నియమించాలని 35 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా గొంతు విప్పితే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. టిఎస్‌పిఎస్సీ బోర్డు రద్దయితే తప్ప,తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐ లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆధిపత్య రాజకీయ పార్టీల నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాబోయే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఈ సందర్భంగా బసంతినగర్‌లో ఏర్పాటు చేసిన పలు వినాయకవిగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో అర్షద్ హుస్సేన్, సిడెం గణపతి, దుర్గం ప్రవీణ్, పిల్లల తిరుపతి, విజయ నిర్మల, సిడెం జ్యోతి,నవీన్,మనోహర్, రాంప్రసాద్,ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News