Monday, December 23, 2024

సోనియాగాంధీ సభలో మైనార్టీ, బిసి, మహిళా డిక్లరేషన్‌లపై ప్రకటన

- Advertisement -
- Advertisement -

పలు అంశాలపై ప్రజలు, మేధావులు, కుల సంఘాలతో చర్చిస్తున్న కాంగ్రెస్ సీనియర్‌లు

మనతెలంగాణ/హైదరాబాద్: మైనార్టీ, బిసి, మహిళా డిక్లరేషన్‌లను సోనియాగాంధీ సభలో ప్రకటించాలని టి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తుక్కుగూడలో ఈ నెల17వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ హాజరుకానున్న నేపథ్యంలో ఈ వేదిక మీద ఈ మేనిఫెస్టోను ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ డిక్లరేషన్‌లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ, బిసి, మహిళా విభాగాలు, ప్రజలు, మేధావులు, కుల సంఘాలతో చర్చిస్తున్నాయి. రెండు రోజుల్లో ఈ అంశాలకు గ్రీన్‌సిగ్నల్ లభించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ మూడు కమిటీలు ఫైనల్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలను ఢిల్లీకి పంపనున్నారు. ఆ తర్వాత మ్యానిఫెస్టోలోనూ ఈ అంశాలను పొందుపరచనున్నారు.

మైనార్టీ డిక్లరేషన్‌లో 25 అంశాలు

మైనార్టీ డిక్లరేషన్‌లో 25 అంశాలను పొందుపరచాలని అందులో ముస్లిం యువత, మహిళలకు మేలు చేసే అంశాలు ఎక్కువగా ఉండాలని టికాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా పాతబస్తీ పరిస్థితులకు అనుగుణంగా ఈ డిక్లరేషన్‌లో పలు అంశాలను రూపొందించ నున్నారు. పాతబస్తీల్లో ప్రాథమిక మౌలిక సౌకర్యాలు, విద్య, నిరుద్యోగం నిర్మూలన, ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేలా ప్రోత్సాహం, ఆరోగ్య సంరక్షణ, రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థకు స్పెషల్ ఫండ్స్, మెట్రో రైలు తదితర అంశాలను ఈ డిక్లరేషన్‌లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా తెలిసింది. దీంతో పాటు మస్లిం యువతకు స్పెషల్ ఎంపవర్‌మెంట్ పథకాలను కూడా ఇందులో చేర్చే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక మహిళా డిక్లరేషన్‌ను కర్ణాటక తరహాలోనే ప్రవేశపెట్టే ఆలోచనను పార్టీ చేస్తున్నట్టుగా తెలిసింది.

బిసి డిక్లరేషన్‌లో 5 అంశాలు

బిసి డిక్లరేషన్‌ను ఐదు ప్రధాన అంశాలతో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. విద్యారంగం, వైద్య రంగం, ఆర్థిక సాయం, రాజకీయాల్లో ప్రాధాన్యత, ఉద్యోగాలకు సంబంధించి వివరాలను ఇందులో పొందుపరచనున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌తో పాటు దళితబంధు తరహాలో బిసిలకు ఆర్థిక సాయం చేసేందుకు ఓ ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. సోనియా ప్రకటించే వరకు ఈ అంశాలు బయటకు కాకుండా పార్టీ నేతలు, కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News