Saturday, November 23, 2024

కేంద్రం- రాష్ట్రాల వ్యాటు ఘాటు

- Advertisement -
- Advertisement -

States are unlikely to reduce taxes

పెట్రోడీజిల్ రేట్లపై ప్రకంపనలు
తగ్గించిన మహారాష్ట్ర , రాజస్థాన్, కేరళ
సమయం కావాలన్న కర్నాటక
కుదరదన్న తమిళనాడు
బకాయిలు చెల్లిస్తే వీలు : బెంగాల్

న్యూఢిల్లీ/ ముంబై : పెట్రోలు డీజిల్‌లపై వ్యాట్‌ను ఇప్పుడు మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు తగ్గించాయి. కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దేశంలో మరింతగా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సి ఉందని స్థానిక పన్నులు కుదించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. తమ ఆదాయానికి మరింత గండిపడేలా వ్యాట్ తగ్గించే పరిస్థితులలో లేమని పలు రాష్ట్రాలు తెలుపుతూ వచ్చాయి. అయితే శనివారమే వ్యాట్ కుదింపు ప్రకటనను కొన్ని రాష్ట్రాలు వెలువరించాయి. మహారాష్ట్రలోని శివసేన నాయకత్వపు ప్రభుత్వం పెట్రోలుపై వ్యాట్‌ను లీటరుకు రూ 2.08 పైసలు , డీజిల్‌పై రూ 1.44 పైసలు తగ్గించాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించారు. ఈ చర్యలతో తమకు ఏటా రూ 2500 కోట్ల ఆదాయానికి గండిపడుతుందని ప్రభుత్వం తెలిపింది. కేరళలోని వామపక్ష ప్రజాస్వామిక కూటమి (ఎల్‌డిఎఫ్) ప్రభుత్వం కూడా వెంటనే పెట్రోలుపై లీటర్‌కు రూ 2.41 పైసలు, డీజిల్‌పై రూ 1.36 పైసలు తగ్గించింది. రాజస్థాన్‌లో వ్యాట్ తగ్గింపు ప్రకటనను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ వెలువరించారు. పెట్రోల్‌పై రూ 2.48 పైసలు, డీజిల్‌పై రూ 1.16 పైసలు కుదించినట్లు వివరించారు.

వివిధ రాష్ట్రాలలో ప్రకంపనలు

తమిళనాడు ఇది బహుభారమంది

వ్యాట్ ధరల తగ్గింపు ప్రక్రియపై వివిధ రాష్ట్రాలలో స్పందనలు వెలువడ్డాయి. రాష్ట్రాలు తమ పన్నుల వాటాను తగ్గించుకోవాలని కేంద్రం కోరడం అనుచితం విస్మయకరం అని తమిళనాడు నిరసన వ్యక్తం చేసింది. దీనిని కేంద్రం ఎలా ఊహించుకుంటుంది? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివెల్ తియాగ రాజన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎప్పుడూ రాష్ట్రాలతో మాట్లాడలేదని, పన్నులు పెంచినప్పుడు ముందు తెలిపారా? ఇప్పుడు తగ్గింపులపై డిమాండ్‌కు దిగుతున్నారని ఇదేం న్యాయమని ప్రశ్నించారు. ఇంతకు ముందటి పన్నుల తగ్గింపుతో రాష్ట్రానికి ఇప్పటికే ఏటా రూ వేయి కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నాడిఎంకె తప్పుపట్టింది. తగ్గింపుపై డిఎంకె ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఇందుకు 72 గంటల సమయం ఇస్తున్నామని అన్నాడిఎంకె అల్టిమేటం ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం వ్యాట్‌ను మరింతగా తగ్గించాలని అక్కడి కాంగ్రెస్ నాయకులు కమల్‌నాథ్ భోపాల్‌లో డిమాండ్ చేశారు. యుపి ఇతర అన్ని రాష్ట్రాలు వెంటనే ఇంధనంపై వ్యాట్‌ను కుదించాల్సి ఉందని బిఎస్‌పి అధినేత్రి మాయావతి తెలిపారు.

తొందర్లోనే నిర్ణయం ః కర్నాటక

తాము అన్ని విషయాలను పరిశీలించి సుంకాల తగ్గింపులపై నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని బిజెపి పాలిత రాష్ట్రం అయిన కర్నాటక తెలిపింది. శనివారం రాత్రి ఇంధన ధరల తగ్గింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని, తాము అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సిఎం బస్వరాజ్ బొమై బెంగళూరులో విలేకరులకు తెలిపారు. తాము వ్యాట్‌ను తగ్గించే ప్రసక్తే లేదని గోవా ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అంశాల జోలికి పోదల్చుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రాలకు కేంద్రం బకాయిలు వస్తే వ్యాట్ తగ్గింపు
తేల్చిచెప్పిన బెంగాల్ టిఎంసి ప్రభుత్వం

ఓ వైపు కేంద్రం నుంచి పలు విషయాలలో రాష్ట్రానికి రావల్సిన నిధులు ఆగిపొయ్యాయి. వీటిని కేంద్రం వెంటనే రాష్ట్రానికి విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులు విడుదల తద్వారా కేంద్రం రాష్ట్రాలపై విధించిన బ్లాకేడ్ ఎత్తివేత జరిగితే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వ్యాట్‌ను కుదిస్తుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ 97000 కోట్ల బకాయిలు విడుదల కావల్సి ఉందని ఇవి వస్తే ఇంధన స్థానిక సుంకాల తగ్గింపుఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చాలారోజుల క్రితమే కేంద్రానికి తెలిపిందని టిఎంసి జాతీయ అధికార ప్రతినిధి సుఖేందు శేఖర రే తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News