- Advertisement -
న్యూఢిల్లీ: ఆక్సిజన్ సరఫరాపై కేంద్ర హోంశాఖ గురువారం కీలక ఆదేశాలు చేసింది. ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాలకు అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఢిల్లీ, యుపి, హర్యానా రాష్ట్రా మధ్య ఆక్సిజన్ సరఫరాపై విభేదాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలను జారీచేసింది. తమ ఆక్సిజన్ ట్యాంకర్లను ఢిల్లీ సర్కార్ తరలించుకుపోతోందంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. అటు ఢిల్లీ కూడా అదే తరహ ఆరోపణలు చేయడంతో రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కేంద్రహోంశాఖ ఈ విషయంలో కలగజేసుకుని ఆక్సిజన్ సరఫరాను అడ్డుకోవద్దంటూ సూచించింది.
States cannot stop Oxygen carrying vehicles
- Advertisement -