Monday, December 23, 2024

సిఎఎను అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు

- Advertisement -
- Advertisement -

సిఎఎని ఉపసంహరించే ప్రసక్తే లేదు
ఆ దేశాల్లోని మైనారిటీలు ఎక్కడకు వెళతారు?
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సిఎఎని రాష్ట్రాలు అడ్డుకోలేవని, పౌరసత్వాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వమే అనుమతించగలదని కూడా ఆయన తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సిఎఎపై ఒక ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో అమిత్ షా అనేక సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు. సిఎఎ పరిధిలోకి పార్శీలు, క్రైస్తవులు వస్తారు కాని ముస్లింలు ఎందుకు అర్హులు కారన్న జఠిలమైన ప్రశ్నకు అమిత్ షా ఎదుర్కొన్నారు. 2014 అక్టోబర్ 31 కన్నాముందు భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు సిఎఎ పౌరసత్వం కల్పించనున్నది. భారత్‌లో జన్మించని పార్శీలు, క్రైస్తవ మతానికి చెందిన శరణార్థుల కు భారత పౌరసత్వం కల్పిస్తున్న సిఎఎ ముస్లింత్మాత్రం ఎందుకు కల్పించదన్న ప్రశ్నకు ముస్లిం జనాభా అధికంగా ఉన్న కారణంగా ఇప్పుడు అది(ప్రాంతం) భారత్ భూభాగం కాదని అమిత్ షా అన్నారు. దాన్ని వారికి ఇచ్చే శామని, అఖండ భారత్‌లో భాగమై మత వేధింపులకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వడం మన నైతిక, రాజ్యాంగపరమైన బాధ్యతని ఆయన జవాబిచ్చారు. ఈనాటి అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్‌లతో కూడిన సమైక్య మహా భారతదేశాన్ని అఖండ భారత్‌గా బిజెపి సంబోధిస్తోంది.

దేశ విభజన జరిగిన కాలంలో పాకిస్తాన్ జనాభాలో హిందువులు 23 శాతం ఉన్నారని, ఇప్పుడు అది 3.7 శాతానికి పడిపోయిందని హోం మం త్రి చెప్పారు. వారంతా ఎక్కడకు వెళ్లిపోయారని ఆయన ప్రశ్నించారు. అంతమందైతే మన దేశానికి రాలేదు. బలవంతపు మత మార్పిడులు జరిగాయి. వారిని ఘోరంగా అవమానించి ద్వితీయ శ్రేణి పౌరులుగా పరగిణించారు. వారంతా ఎక్కడు వెళతారు..దీనిపై మన పార్లమెంట్, రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోకూడదా అని ఆయ న ప్రశ్నించారు. 1951లో బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 22 శాతమని, 2011లో ఇది 10 శాతానికి పడిపోయిందని, వారంతా ఎక్కడకు వెళ్లారని ఆయన ప్రశ్నించా రు. 1982లో అఫ్ఘానిస్తాన్‌లో దాదాపు 2 లక్షల మంది సి క్కులు, హిందువులు ఉండేవారని, ఇప్పుడు 500 మంది మాత్రమే మిగిలారని ఆయన చెప్పారు. తమ మత విశ్వాసాలను పాటించే హక్కు వారికి లేదా అని ఆయన నిలదీశారు. భారత్ ఒకటిగా ఉన్నపుడు వా రంతా మన వారేన ని, వారంతా మన సోదరులు, సోదరీమణులు, తల్లులని అమిత్ షా అన్నారు. సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదని, మన దేశంలో భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వాలన్న నిర్ణయం పార్లమెంట్ తీసుకున్నదని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

సిఎఎపై మైనారిటీలు కాని ఇతరులు ఎవరైనా కాని భయపడాల్సిన అవసరం లేదని, ఎవరి పౌరసత్వాన్ని తొలగించే నిబంధన ఏదీ సిఎఎలో లేదని ఆయన తెలిపారు. అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు చెందిన హిండూ, బౌద్ధ, జైన, సిక్కు, క్రైస్తవ, పార్శీ శరణార్థులకు హక్కులు, పౌరసత్వాన్ని ఇచ్చేందుకు సిఎఎ ఉందని ఆయన అన్నారు. సిఎఎ ద్వారా కొత్త ఓటు బ్యాంకును బిజెపి సృష్టిస్తోంద న్న ప్రతిపక్షాల ఆరోపణపై స్పందిస్తూ ప్రతిపక్షాలకు వేరే పనేమీ లేదని, చెప్పింది చేసే అలవాటు వారికి లేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని 370వ అధికర ణ రద్దు కూడా రాజకీయ లబ్ధి కోసం చేసిందేనని వారు(ప్రతిపక్షాలు) చెప్పారని, కాని 1950 నుంచి తాము 370వ అధికరణను రద్దు చేస్తామని చెబుతున్నామని అమిత్ షా తెలిపారు. సిఎఎ అమలుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రకటించా ల్సి వచ్చిందన్న ప్రతిపక్షాల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీతోసహా ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ అసత్యాల రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సిఎఎ అమలును ఉద్దేశపూర్వకంగా ఇప్పుడే చేశామనడం అసత్యమని ఆయన తెలిపారు. సిఎఎని అమలుచేసి అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు చెందిన శరణార్థులకు భారతీయ పౌరసత్వాన్ని ఇస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే బిజెపి చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

2019లో దీన్ని పార్లమెంట్ ఆమోదించిందని, అయితే కొవిడ్ కారణం గా అమలులో జాప్యం జరిగిందని ఆయన వివరించారు. బుజ్జగింపు రాజకీయాలు చేసి తమ ఓటు బ్యాం కును పదిలపరుచుకోవాలని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయన్నారు. వాటి బండారం బయటపడిందని, సిఎఎని ఈ దేశ చట్టంగా ప్రజలు గుర్తించారని తెలిపారు. ఎన్నికల ముందు సిఎఎని అమలు చేస్తామని తాను గ త నాలుగేళ్లలో 41 సార్లు చెప్పానని హోం మంత్రి అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై అమిత్ షా మండిపడ్డారు. కేజ్రీవా ల్ మతిస్థిమితం కోల్పోయారని ఆరోపించారు. శరణార్థులకు పౌరసత్వం ఇస్తే చోరీలు, అత్యాచారాలు పెరిగిపోతాయంటూ కేజ్రీవాల్ చేసిన ప్రకటనను ఆయన తప్పుపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News