న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా ముమ్మరంగా సాగించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ లేఖల ద్వారా సూచించింది. వారంలో వ్యాక్సినేషన్ చేపట్టే రోజులను పెంచాలని, కనీసం నాలుగు రోజులైనా వ్యాక్సినేషన్ నిర్వహించాలని, ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్‌భూషన్ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 19న ఈ లేఖలు రాష్ట్రాలకు రాయడమైంది. ఇంకా చాలామంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు వ్యాక్సిన్ పొందాల్సి ఉందని దీని పురోగతి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటోందని వివరించారు. మార్చిలో వయోవృద్ధులకు, కరోనా వల్ల వచ్చే ఇతర రుగ్మతల బాధితులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ప్రజారోగ్య వసతులన్నిటినీ వినియోగించు కోవాలని మెడికల్ కాలేజీల నుంచి జిల్లా ఆస్పత్రులు, పిహెచ్‌సిల వరకు ఈ ప్రక్రియలో వినియోగించుకోవాలని సూచించారు.
States Need to increase pace of Vaccination: Centre