Saturday, December 21, 2024

మానుకోటలో రాష్ట్రంలోనే ఎత్తైన అమరవీరుల స్థూపం ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు రాష్ట్రం ఏర్పాటుతోనే సరిపోలేదని.. అందుకు అనుగుణంగా సుపరిపాలన కొనసాగాలి.. ఉద్యమ ఘట్టాలను కూడా గుర్తు చేసుకునేలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగాలని పూర్వ జేఏసీ చైర్మైన్ ఫ్రొఫెసర్ ఎం.కోదండ రాం అన్నారు. తెలంగాణ జేఏసీ మహబూబాబాద్ కమిటీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యానారాయణ నేతృత్వంలో మానుకోట జిల్లా కేంద్రంలోని కోర్టు సెంటర్‌లో రాష్ట్రంలోనే 36 అడుగుల అత్యంత ఎత్తైన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సోమవారం కోదండరాం చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ స్థూపావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ ఫ్రొఫెసర్ తుమ్మ పాపిరెడ్డి, రాష్ట్ర కో. కన్వీనర్లు అద్దంకి దయాకర్, గోవర్ధన్, చంద్రన్న, ఫ్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, బి.విజయసారధి, మండల వెంకన్న, డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి తదితరులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలు జల్లి వారు అధికారికంగా ప్రారంభించారు. అనంతరం డాక్టర్ డోలి సత్యనారాయణ అద్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రో. కోదండరాం మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న మనంన తెలంగాణ ఉద్యమంలో అనుకున్న అకాంక్షలు నెరవేరినట్లేనా అనే విషయాన్ని ఆకాళింపు చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News