- Advertisement -
న్యూఢిల్లీ: రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 51 లక్షల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 20 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు పంపిణీ చేసింది. మే 14 వరకు 18.43 కోట్ల వ్యాక్సిన్ డోసులను (వృధాతో కలిపి) అందించారు. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.84 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, అనేక రాష్ట్రాలు తమ వద్ద వ్యాక్సిన్ డోసుల కొరత ఉన్నట్టు చెబుతున్నాయి. దీనిపై పూర్తిగా సమీక్షించ వలసి ఉంది.
States to Receive 51 lakh doses in Next 3 days
- Advertisement -