Wednesday, January 22, 2025

నెత్తు’రోడ్లు’

- Advertisement -
- Advertisement -

వేర్వేరు ప్రమాదాల్లో
రాష్ట్రవ్యాప్తంగా
ఎనిమిది మంది
దుర్మరణం

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రంలోని రో డ్లు నెత్తురోడాయి. వివిధ జిల్లాల్లో ఆదివారం జరి గిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు, జగిత్యా ల జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డి జిల్లాలో ముగ్గరు వ్యక్తులు చనిపోయారు. ఇందుకు సంబంధించి వి వరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పెద్దక ల్వల హుస్సేన్‌వాగు బ్రిడ్జి వద్ద సాంకేతిక లోపంతో ఆగివున్న డిసిఎం వాహనాన్ని గోదావరిఖని నుంచి వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ఢీ కొట్టడం తో స్కార్పియోలో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన చై త్రముఖి(25), హులాస్ రాయ్ (40) అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలో ఉన్న మరో ఐదుగు రిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ప రిస్థితి విషమించిన హేమంద్ర సహరిని హైదరాబా ద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో సిద్దపేట వద్ద మృతి చెందాడు. మిగిలిన వారికి పెద్దపల్లి ప్రభు త్వం ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ వర్క్‌కు సంబంధించి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని న మోదు దర్యాప్తు చేపట్టారు.

కాగా, జగిత్యాల జిల్లా లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత చెందగా. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని మల్యాల మండలం రాజారం గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం సంభవించిన రోడ్డు ప్రమాదంలో వేగంగా వచ్చిన ఓ బైక్ ఎదురుగా వ స్తున్న మరో భైక్‌ను ఢీకొట్టిన్న ఘటనలో ఇద్దరూ అ క్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టా డుతున్నారు. వేములవాడ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన వేముల దాసు (48) తన భార్య లావణ్యతో కలిసి బైక్‌పై జగిత్యాల మండలం ధరూర్ గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా రాజారం స్టేజి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న బైక్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో వేముల దాసు తీవ్ర గాయాలపాలై అక్కడిక క్కడే మృతి చెందగా, దాసు భార్య లావణ్య తీవ్ర గా యాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అతివేగం గా వచ్చి ఢీకొట్టిన వాహనంపై ఉన్న జగిత్యాల అ ర్బన్ మండలం టిఆర్ నగర్‌కు చెందిన సయ్యద్ యాసిన్(16) అక్కడికక్కడే మృతిచెందగా మల్యాల మండల కేంద్రానికి చెందిన కట్కం మహేశ్ తీవ్రగా యాల పాలయ్యాడు. లావణ్య, మహేశ్‌ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిద్దరిని కరీంనగర్‌కు తరలించారు.

కాగా, రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదా ల్లో ముగ్గురు మృతి చెందారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదులాబాద్ అనుబంధ గ్రామం పోతరాజ్‌గూడెంకు చెందిన సామలేటి యాదయ్య (65) పోతరాజ్ గూడెం బస్సుస్టాప్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. అతరన్ని ఘట్‌కేసర్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించి అక్కడ అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మరణిం చాడు. అదేవిధంగా ఇదే మండలంలోని ఘణపూర్ గ్రామానికి చెందిన తిరుపతి సురేష్ (40) బైక్‌పై మైసమ్మగుట్ట వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా అవుషాపూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న కారు ఢీ కొనడంతో సురేష్ అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చంద్రబాబు తెలిపారు. కాగా, జిల్లాలోని తల కొండపల్లి మండల కేంద్రంలో బైండ్ల మల్లేష్(28) స్నేహితులతో కలిసి స్కార్పియోలో ఆమన్‌గల్‌లో జరిగే బంధువుల వివాహానికి వెళుతుండగా ఎక్స్ రోడ్డువద్దకు రాగానే వాహనం బోల్తా పడింది. తీ వ్రంగా గాయపడ్డ మల్లేష్‌ను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శివశం కర వరప్రసాద్ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News