Wednesday, January 22, 2025

రాష్ట్రవ్యాప్తంగా ఓబిసి సమ్మేళనాలు, సదస్సులు : బూర నర్సయ్యగౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బిసి సమ్మేళనాలు, సదస్సులను నిర్వహిస్తామని మాజీ ఎంపి, బిజెపి నేత బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నగరంలో నిర్వహించిన ఓబిసి సమ్మేళనానికి భారీ ఎత్తున తరలివచ్చిన బిసి నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమ్మేళనానికి అండగా నిలిచిన ఎంపి డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో కోటి మంది బిసి ఓటర్లను బిజెపికి అనుకూలంగా మార్చేందుకు తమ సమ్మేళనాలు ఉంటాయన్నారు. పార్టీ ప్రకటించిన బిసి డిక్లరేషన్‌ను ప్రత్యేక సమావేశాలు పెట్టి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బిఆర్‌ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి పదవి బిసిలకు లేదా దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. సమావేశంలో ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలె భాస్కర్, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News