Friday, November 22, 2024

వర్షం ‘దొంగదెబ్బ’

- Advertisement -
- Advertisement -

తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా కుండపోత

అన్నదాతకు తీరని నష్టం.. కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్దయిన ధాన్యం
అంధకారంలో పలు ప్రాంతాలు.. కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు
హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయం

తడిసి ముద్దయిన ధాన్యం
నేలరాలిన మామిడి, కూరగాయల తోటలు
విరిగిపడ్డ చెట్లు, గాలికి లేచిపోయిన షెడ్లు
కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అపార నష్టం
నష్ట అంచనాల కోసం అధికారులతో కలెక్టర్ల కాన్ఫరెన్స్

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: ప్రకృతి కన్నెర్ర చేసి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం అన్నదాతలను ని లువునా ముంచేసింది. ఆరుగాలం పండించిన పం ట.. చేతికొచ్చే సమయానికి చెప్పపెట్టకుండా మం గళవారం తెల్లవారుజామున వచ్చిన భారీవర్షంతో తీవ్రనష్టం కలిగింది. సుమారు మూడు గంటల పాటు కురిసిన వర్షానికి రైతన్న లబోదిబోమంటున్నారు. అదీ.. ఇదీ అని లేకుండా వరి, మిరప, మా మిడి, కూరగాయల తోటలు.. ఇలా.. అన్ని పంటలపై వర్షం తన ప్రతాపాన్ని చూపింది. హైదరాబా ద్ నగరంతోపాటు, ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వ ర్షం తన ప్రభావాన్ని చూపింది. కొన్ని జిల్లాల్లో ప నులపై ఉన్న వరి సైతం నీట మునిగింది. మరికొ న్ని చోట్ల కాపుకొచ్చిన పంట నెలకొరిగింది. వర్షంతో కల్లాల్లో అరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్ద యింది. మార్కెట్‌లలో ఆరబోసి కుప్పలు చేసి, గ న్నీ సంచుల్లో నింపి పెట్టి పాలిథిన్ కవర్స్ కప్పినా కూడా.. చెప్పపెట్టకుండా వచ్చిన అకాల వర్షం, గాలివానతో పాలిథిన్ కవర్స్ కొట్టుకుపోయి ధా న్యం మొత్తం నీళ్లల్లో కొట్టుకుపోయింది.

ఇక్కడా.. అక్కడా అని లేకుండా రైతులను ఈ వర్షం నిలువునా ముంచేసింది. కాపుకు వచ్చిన మామిడి నేల రాలిపోయాయి. ఎక్కడ చూసినా అన్నదాతలకు పుట్టె డు దుఖ్ఖమే కన్పిస్తోంది. దీంతో రైతన్నలు మనోవేదనకు గురవుతున్నారు. అకాలవర్షానికి జరిగిన ఆపార నష్టానికి జిల్లాల కలెక్టర్లు బుధవారం అధికారులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించి జరిగిన నష్టంపై వివరాలు తెలుసుకుని నష్ట అంచానాలు వేయాలని ఆధికారులను ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మారం మండల కేంద్రంలో చేతి కొచ్చిన మామిడి నేల పాలు కాగా, వరి ధాన్యం నీటిపాలైంది. గ్రామాల్లో పలువురి ఇ ళ్లు నేలమట్టమయ్యాయి, రేకుల షేడ్లు లేచిపోయా యి. కురిసిన వర్షానికి నష్టం జరిగిన ప్రాంతాలను పలువు రు ప్రజాప్రతినిధులు వెళ్లి రైతన్నకు జరిగిన నష్టా న్ని పరిశీంచారు. రాయికల్ మండలంలోని రామాజిపేటలో తడిసిన వడ్లను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వెల్దుర్తి, మాసాయిపేట మండలంలోని ఆయా గ్రామాలలో ఇంటి పైకప్పులు, రేకులు, చెట్టు కొ మ్మలు విరిగిపోయాయి. ఈదురుగాలులతో విద్యు త్ వైర్లు తెగి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కాపుకొచ్చిన మామిడి నేలరాలింది. నెల రాలిన వరి పంట పొలాలను ఆయా గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. వర్షానికి రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ప్రాంతం లో ఈదురగాలులతో కూడిన వర్షం బీభత్సం సృ ష్టించింది. ముఖ్యంగా వరి, మామిడి రైతాంగాన్ని కోలుకోకుండా చేసిం ది. కేటిదొడ్డి మండలం పరిధిలోని ఈర్లబండ, వెంకటాపురం, పాతపాలెం, కొం డాపురం తదితర గ్రామాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణఃగా వరి నేలకొరగ గా… కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పాతపాలెం గ్రామంలో విద్యుత్ స్థం బాలు నేలకొరగాయాయి. ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు కిం దపడిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో కురిసిన వర్షానికి సుప్రసిద్ధ యాదాద్రి ఆలయంతోపాటు, పలు ప్రాంతాల్లో వర్ష తన ప్రతాపాన్ని చూపింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో యాదాద్రి కొండపై ఘాట్ రోడ్డు కుంగిపోయింది.

గాలివానతో చలువ పం దిళ్లు కూలాయి. క్యూకాంప్లెక్స్ వద్ద భక్తుల ఇక్కట్లు ఇన్నీ అన్ని కానట్టుగా కన్పించాయి. వర్షంపు నీటితో క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు ఇక్కట్లు పడ్డారు. వర్షానికి ఘాట్‌రోడ్‌లో బురద మట్టి వచ్చి చేరింది. దీంతో బురద మట్టిలో ఆర్టీసీ ఉచిత బస్సులు నిలిచిపోయాయి. దీంతో కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుంటున్నా రు. రంగారెడ్డి జిల్లా దండుమైలారం, పోల్కంపల్లి, నెర్రపల్లి, ముకునూర్, కీసరలో మామిడి, వరి, కూరగాయల తోటలపై వరుణుడు తన ప్ర తాపాన్ని చూపాడు. వివిధ ప్రాం తాల్లో చెట్లు నేలకూలాయి. అదేవిధం గా రాజధానిలో సైతం కుండపోత వర్షం కురిసింది. కాగా, అకాల వర్షాలపై మంత్రి గంగుల కమలాకర్ ఆరా తీశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పరిస్థితిపై కలెక్టర్ల నుంచి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దుబ్బాకలో పిడుగుపడి రైతు మృతి

దుబ్బాక దాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగు పడి నేర్లనుగడ్డకు చెందిన సౌడు పోచయ్య(65) అనే రైతు మృతి చెందాడు. సమీపంలో ఉన్న రెడ్డబోయిన కొండయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ కొండయ్యను వెంటనే 108 ఆంబులెన్స్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News