Thursday, April 3, 2025

సహజ కలర్స్‌తో వినాయకుడి విగ్రహాలు తయారు చేయాలి

- Advertisement -
- Advertisement -

Statues of Ganesha should be made with natural colors

తయారీదారులతో జిహెచ్‌ఎంసి, పోలీసులతో
సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర సమావేశం

హైదరాబాద్: సహజ కలర్స్‌తో వినాయకుడి విగ్రహాలను తయారు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. వినాయకుడి విగ్రహాలను తయారీదారులతో సైబరాబాద్ కమిషనరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో జిహెచ్‌ఎంసి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ న్యాచురల్, బయోడీగ్రేడబుల్ వస్తువులతో వినాయకుడి విగ్రహాలను తయారు చేయాలని కోరారు. జిహెచ్‌ఎంసి అధికారులు తయారీదారులకు విగ్రహాల తయారీకి శిక్షణ ఇప్పిస్తారని తెలిపారు. వినాయకుడి విగ్రహాల తయారీదారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. డిసిపి ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి పరిధిలో ప్రతి ఏడాది 5లక్షల వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేస్తారని తెలిపారు. ప్రభుత్వం తరఫున పర్యావరణానికి విఘాతం కలగకుండా చూస్తామని తెలిపారు. మట్టి విగ్రహాల తయారీకి, పంపిణీకి పార్కులు, స్టేడియాలను కేటాయిస్తామని తెలిపారు. మట్టి విగ్రహాలను తయారు చేసేవారికి ఇన్‌పుట్ సబ్సిడీ, శిక్షణ ఇస్తామని తెలిపారు. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాయింట్ ఛీఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం వల్ల నీరు కలుషితం అవుతుందని తెలిపారు. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. సమావేశంలో శేరిలింగంపల్లి జడ్‌సి ప్రియాంక అలా, కూకట్‌పల్లి జడ్‌సి మమతా, మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, వినాయకుడి విగ్రహాల తయారీ దారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News