Tuesday, November 5, 2024

హోటళ్లలో కాదు.. ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో బస చేయండి

- Advertisement -
- Advertisement -

Stay at guesthouses, not hotels: UP CM

మంత్రులకు యుపి సిఎం ఆదేశం

లక్నో: అధికారిక పర్యటనల్లో ప్రైవేట్ హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథిగృహాలలో బస చేయాలని రాష్ట్ర మంత్రులను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అంతేగాక తమ వ్యక్తిగత కార్యదర్శులుగా తమ బంధువులను నియమించవద్దని కూడా ఆయన మంత్రులను ఆదేశించారు. ప్రభుత్వ అతిథిగృహాలలో బసచేయాలన్న ఆదేశాలు ప్రభుత్వ అధికారులకు కూడా వర్తిస్తాయని మంగళవారం జరిగిన అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కచ్ఛితంగా సమయపాలన పాటించాలని, మధ్యాహ్నం భోజన విరామాన్ని 30 నిమిషాలకే పరిమితిం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ బ్రేక్ మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటలకు వరకు మాత్రమే ఉంటుందని, అయితే చాలామంది ఉద్యోగులు లంచ్ బ్రేక్ తర్వాత చాలా ఆలస్యంగా ఆఫీసులకు చేరుకుంటున్నారని ఒక అధికారి చెప్పారు. కేవలం అరగంట మాత్రమే లంచ్ బ్రేక్ తీసుకోవాలని సిఎం కచ్ఛితమైన ఆదేశాలు జారీచేసినట్లు ఆ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News