Wednesday, January 22, 2025

వర్షాకాలంలో విద్యుత్ వాహకాలకు దూరంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

వర్షాకాలంలో విద్యుత్ వాహకాలకు దూరంగా ఉండాలి
విద్యుత్ రంగ నిపుణులు
మన తెలంగాణ/ హైదరాబాద్: విద్యుద్ఘాతంలో ఒకరు మృతి..వేలాడుతున తీగలు, కంచలేని ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలు తగిలి పశువులు మృతి..ఇటువంటి సంఘటనలు సాధారణంగా వర్షాకాలంలోనే అధిక ఉంటాయని విద్యుత్‌వాహకాలకు సాద్యమైనంత దూరంగా ఉండటంతో ఇటువంటి ప్రమాదాలున అరికట్టవచ్చని ఉండాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లలో ప్యూజులు పోయినప్పుడు రైతులు వాటిని స్వయంగా వేసే ప్రయత్నాలు చేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు.

అటువంటి పరిస్థితులు వస్తే విద్యుత్ లైన్‌మెన్‌కు సమాచారం అందించాలన్నారు. విద్యుత్ వైర్లు తెగిపడా .. వేలాడుతున్నా ఆ దిశగా ఎవరిని వెళ్ళేందుకు అనుమతించద్దని చెబుతున్నారు.అంతే కాకుండా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను అనధికారికంగా ఎక్కేవారిని నియంత్రించాలని సూచిస్తున్నారు. వేడి ప్రదేశాల్లో విద్యుత్ తీగలను, పరికరాలను ఉంచకూడదని, చేతులు తడిగా ఉన్నప్పుడు విద్యుత్ సరఫరా పరికరాలు, స్విచ్‌లను ముట్టుకోవద్దంటున్నారు. పిల్లలకు అందనంత ఎత్తులో ప్లగ్‌లను ఏర్పాటు చేయాలని ,ఇంటి వైరింగ్‌కు ఎర్తింగ్ తప్పకుండా చేయడమే కాకుండా ఇంట్లో ఉపయోగించే గృహోపకరణాలను ఎక్కువ కాలం ఉపయోగించనట్లయితే ప్లగ్‌ల నుంచి వాటిని తొలగించాలని చెబుతున్నారు.

అంతే కాకుండా ప్లగ్‌లను స్విచ్‌ఆఫ్ చేయకుండా బయటకు తీయడం లేదా, ప్లగ్‌లను పట్టుకుని లాగడ వంటి చర్యలు చేయకూడదని చెబుతున్నారు. పాడైన ప్లగ్‌లను,బల్బులను , హోల్డర్‌లను వినియోగించడం కాని, ప్లగ్‌లలలో పిన్నులు పెట్టవంటి చర్యలకు పాల్పడవద్దని చెబుతున్నారు.నూతనంగా నిర్మిస్తున్న భవనాలను నీటితో తడుపుతున్న సమయంలో దగ్గర్లో ఉన్న విద్యుత్ తీగలను,పరికరాలను గమనించాలని సూచిస్తున్నారు. దుస్తులను ఆరవేసేందుకు ఇనప తీగలను వినియోగించవద్దని, విద్యుత్ తీగల కింద మొక్కలు నాటవద్దని, తీగలు తగిలిన చెట్లను ముట్టుకోవద్దని, అదే విధంగా అధికారుల అనుమతి లేకుండా చెట్లను కొట్టవదని, లైన్ మెన్ పర్యవేక్షణలో వాటిని తొలగించాలని చెబుతున్నారు.సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడవద్దని, ఇలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మహిళలు వాషింగ్ మిషన్, గ్రైండర్లు, మిక్సీలు వాడే సమయంలో నీటి తడి లేకులండా జాగ్రత్తపడాలని చెబుతున్నారు. హీటర్, గీజర్ తదితర పరికరాలు ఉపయోగించే సమయంలో స్విచ్ ఆఫ్ చేసి నీటిని ముట్టుకోవాలంటున్నారు. ఒక వేళ ఎవరైనా విద్యుత్ ప్రమాదానికి లోనయితే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా పొడి కర్రతో కాని విద్యుత్ వాహకం ప్రవహించని ప్లాస్టిక్ వస్తువుతో కాని ప్రమాదానికి గురైన వ్యక్తిని తప్పించి వెంటనే 108కు సమాచారం అందచేసి విలువైన ప్రాణాలు కాపాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు మోటారు సామర్థానికి సరిపోయే నాణ్యత గల విద్యుత్ తీగలను వినియోగించాలని, వ్యవసాయ పంప్‌సెట్‌కు తప్పనిసరిగా ఎర్తింగ్ చేయాలని,వాటికి సంబంధించిన తీగలను నేలమీద ఉండకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా తడి దుస్తులతో పంప్‌సట్‌ను ఆన్ చేయవద్దని, ఒక వేళ పంపు సెట్‌లు మరమ్మత్తులకు గురైతే ఎలక్ట్రిషియన్ లేదా విద్యుత్ అధికారికి సమాచారం అందించాలని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News