Tuesday, January 21, 2025

స్టాక్ మార్కెట్ కుదేలవుతుంటే…అనిశ్చితిలో మదుపరులు

- Advertisement -
- Advertisement -

Market best days gone

న్యూయార్క్: స్టాక్ మార్కెట్ మంచి రోజులు కనుమరుగవుతున్నాయనిపిస్తోంది. ఎందుకంటే ఎస్ అండ్ పి 500కు చెందిన స్టాకులు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ దశలో వేచి ఉండాలా లేక స్టాకులు పెంచుకోవాలా? అని మదుపరులు సందిగ్ధంలో ఉన్నారు. తెలివైన మదుపరులు తమ హోల్డింగ్స్ ను గణనీయంగా తగ్గించుకున్నారు. S&P 500 సంవత్సరంలో 23 శాతం మేరకు క్షీణించింది.  అక్టోబర్‌లో జరిగిన కొద్దిపాటి ర్యాలీతో, బలమైన US ఉద్యోగాల డేటా ఫెడరల్ రిజర్వ్ నుండి మరింత మార్కెట్-ఊతం రేటు  బలం చేకూర్చడంతో, ద్రవ్యోల్బణంపై పోరాటానికి అమెరికా ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపించింది.

“ఇది  పుష్ మరియు పుల్ మధ్య ఊగిసలాడుతోంది, పెరుగనున్న మార్కెట్ లో నేను  తక్కువ పెట్టుబడి పెడుతున్నానా,   ర్యాలీని పట్టుకోవడం కోల్పోతున్నానా,  లేక  తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానా అని భయపడుతున్నాన” అని బ్యాంక్ ఆఫ్ అమెరికా  గ్లోబల్ ఈక్విటీస్ ట్రేడింగ్ హెడ్ గ్లెన్ కోహ్ అన్నారు.

స్టాక్స్‌లో తక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల గణనీయమైన లాభాలను కోల్పోయే అవకాశం ఉందని చరిత్ర తెలుపుతోంది. కాగా వెల్స్ ఫార్గో ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం, పెట్టుబడిదారుల వార్షిక సగటు రాబడి సంవత్సరానికి 7.8% నుండి 3.2 శాతానికి పడిపోయింది. స్టాక్స్‌పై బుల్లిష్ గా ఉండడం తొందరపాటుతనం కాగలదని చాలా మంది మదుపరులు భావిస్తున్నారు. వారిని విలువ(వాల్యూయేషన్) ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News