Wednesday, January 8, 2025

ఒడిశా స్టీల్ ప్లాంట్‌లో స్టీమ్ లీక్ ప్రమాదం..ఇంటెన్సివ్ కేర్ లో ఇద్దరు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశా డెంఖనల్ జిల్లాలోని టాటా స్టీల్ ప్లాంట్‌లో మంగళవారం స్టీమ్ లీకై 18 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే . వీరిలో ఇదరు ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారని, మిగతా 16 మంది ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని టాటాస్టీల్ కంపెనీ ప్రకటనలో పేర్కొంది. కాలిన గాయాలతో ఉన్న 18 మందిని కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడమైందని, వీరిలో ఇద్దరు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని మిగతా 16 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. వీరందరికీ నాణ్యమైన ఉన్నత స్థాయిలో వైద్యం అందుతోందని తెలిపింది. ప్రమాదస్థలంలో తీవ్రమైన గాయాల పాలైన మరో వ్యక్తి ఇప్పుడు బాగా కోలుకున్నాడని, త్వరలో డిశ్చార్జి అవుతారని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News