Thursday, January 23, 2025

నకిలీ విత్తనంపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు: మంత్రి నిరంజన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర విత్తన రంగానికి ఉన్న ఖ్యాతి ని కాపాడుకుందామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించా రు. వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగం గా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు శనివారం అన్ని జిల్లాల ఎస్‌పిలు, డిఎఒ, ఎఒల తో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి హాజరయిన మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ విత్త న తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలలో నకిలీ విత్తన సమస్య ఉన్నదని వెల్లడించారు. తక్కువ ధరకు విత్తనాలు లభిస్తుండడం మూలంగానే రైతులు నకిలీ విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నారన్నారు.ప్రధానంగా సాగులో ఉండే కలుపు సమస్యను ఎదుర్కోవడానికి గడ్డి మందు కొట్టేందుకు అవకాశం ఉండడంతో కలుపుకూలీ ఖర్చులు తగ్గుతున్నాయని రైతులు నకిలీ విత్తనాల వైపు ఆకర్షితులవుతున్నట్టు తెలిపారు. గడ్డిమం దు గ్లైఫో సెట్ అమ్మకాలపై వ్యవసాయ అధికారులు నిఘాపెట్టాలని ఆదేశించారు.

లైసెన్స్ లే కుండా విత్తనాలు అమ్మినా, కాలంతీరిన విత్తనాలను అమ్మినా కఠినచర్యలు తీసుకోవాలని, హెచ్ టీ కాటన్ విత్తనాలను అరికట్టాలని హెచ్చరించారు. రైతులు తక్కువ ధరకు వస్తున్నాయన్న ఉద్దేశంతో నకిలీ విత్తనాలను కొనవద్దని సూచించా రు. ఈ ఏడాది పత్తి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉందన్నారు. గత ఏడాది వర్షాలు వెనకాముందు కావడం, అధికవర్షాల మూలంగా పత్తిపంటను పెద్దఎత్తున సాగు చేయలేకపోయారని తెలిపారు. విత్తన తనిఖీలలో నిబంధనల మేరకే టాస్క్ ఫోర్స్ టీం వ్యవహరించాలని సూ చించారు. తనిఖీలలో అత్యుత్సాహం ప్రదర్శించడం, తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తనాలు, పురుగుమందుల స్టాక్ వివరాలు దుకాణాల ముందు ఉంచాలని, స్టాక్ వివరాలు పెట్టలేదన్న కారణాలతో షాపులు సీజ్ చేయొద్దని, వారికి విషయం తెలిపి ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని సూచించారు.

లైసెన్స్ పరిమితి తీరిన తర్వాత దానిని రెన్యువల్ కు కొంత సమయం ఉంటుందని , ఆ సమయం కూడా తీరి ఉంటేనే అమ్మకందారులపై చర్యలు తీసుకోవాలన్ని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అని నిర్దారణ అయిన తర్వాతనే కేసులు నమోదు చేయాలని సూచించారు. విత్తనరంగంలో తెలంగాణకు ఉన్న ఖ్యాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాగంపైనే ,విత్తన వ్యాపారులపైన కూడా ఉందన్నారు. నకిలీ విత్తనాల కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై అవకాశాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. చట్టంలోని లొసుగులతో దోషులు తప్పించుకోకుండా వెంటనే శిక్షలు అమలయితే నకిలీ విత్తన తయారీదారులలో మార్పు వస్తుందన్నారు. దోషులు తప్పించుకోరాదని, నిర్దోషులు ఇబ్బందులు ఎదుర్కోకూడదని, రైతుల కష్టం వృధాకారాదని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితోపాటు హోమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీపీలు మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఐజీ నాగిరెడ్డి, ఐజీ డీఎస్ చౌహాన్, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ అనిల్ కుమార్, ఐజీపీ ఇంటలిజెన్స్ రాజేష్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, రంగారెడ్డి కలెక్టర్ అమేయ్ కుమార్, సీడ్స్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News