Friday, November 22, 2024

ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

Steel foot against those violating traffic rules

రాయితీ చలాన్లు ముగియగానే బాదుడే
స్పెషల్ డ్రైవ్‌లో నంబర్ ప్లేట్ల 9,387 కేసులు నమోదు
బ్లాక్ ఫిల్మ్ 4,280 నమోదు

హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. భారీగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా ఫోర్ వీలర్లు, టూవీలర్లు, బస్సులు, లారీలకు రాయితీపై జరిమానాలు చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అనుమతి ఇచ్చారు. దీనికి వాహనదారులు నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పటి వరకు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ.190 కోట్లు వసూలయ్యాయి. ఇప్పటి వరకు జరిమానాలు చెల్లించని వారు వెంటనే కట్టాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. నిర్ణీత గడువు ముగియగానే ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

స్పెషల్ డ్రైవ్…

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నంబర్ ప్లేట్ సరిగా లేని వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 9,387 కేసులు నమోదు చేశారు. సౌండ్ పొల్యూషన్ నిర్ణీత నిబంధనల మేరకు లేని వాహనాలపై 3,270 కేసులు నమోదు చేశారు. అలాగే సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా కార్ల గ్లాసులకు బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్లు వేసుకున్న వారిపై 4,280 కేసులు నమోదు చేశారు. బ్లాక్ ఫిల్మ్ వాడుతున్న వారు ప్రముఖులైనా కూడా వదలడంలేదు. వారి వాహనాలను ఆపి కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడం, వెంటనే ఫిల్మ్‌ను తొలగిస్తున్నారు. ఎంత శాతం బ్లాక్ ఫిల్మ్ ఉండాలో సూచనలు విడుదల చేశారు.

ఆర్టిఏ నంబర్ ప్లేట్లు…

వాహనదారులు తమకు ఇష్టం వచ్చినట్లుగా వాహనాల నంబర్ ప్లేట్లను అమర్చుకోవడానికి వీలులేదు. ఆర్టి అధికారులు జారీ చేసిన నంబర్ ప్లేటును మాత్రమే వాహనాలకు అమర్చుకోవాలి. నంబర్ ప్లేట్ వైట్‌గా, లెటర్లు బ్లాక్ కలర్‌లో ఉండాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఫ్యాన్సీ, ఫైబర్ లేదా ప్లాస్టిక్ లెటర్లకు అనుమతి లేదు. నంబర్ కన్పించకుండా ట్యాంపర్డ్, బెండ్, కవర్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.అలాగే ప్రెస్, పోలీస్, లాయర్, ఆర్మీ తదితర స్టిక్కర్లు వాహనాలపై వేసుకున్న వారిని ఆపి వాటిని తొలగిస్తున్నారు. వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లు వేయకూడదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇది మోటార్ వాహనాల చట్టం నిబంధనలకు విరుద్దమని తెలిపారు.

నాయిస్ పొల్యూషన్….

చాలామంది వాహనదారులు వాహనాలతో వచ్చిన సైలెన్సర్లను మార్చి ఎక్కువ సౌండ్ వచ్చే వాటిని బిగించుకుంటున్నారు. దీని వల్ల చలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా లేని మాడిఫైడ్ సైలెన్సర్లను అమర్చుకున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. బైక్‌లను మాడిఫైడ్ చేసే వారితో జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News