ప్రపంచ వ్యాప్తంగా విద్యా బోధనను విప్లవాత్మకంగా మారుస్తున్న విధానమే ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్స్ (STEM) సమీకృత అధ్యయనం. విద్యను ఏకీకృతం చేయడానికి సంబంధించిన తాత్విక బోధనా నమూనా ఇది. STEM తన 30 సంవత్సరాల వేడుకలకు సిద్ధమవుతోంది. యుఎస్‌ఎ, గ్రేట్ బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని ప్రధాన దేశాలలో పటిష్ఠంగా అమలవుతూ ఇప్పుడిప్పుడే ఇండియాలో విస్తరిస్తున్న స్టెమ్‌ను గురించి విద్యార్థుల ప్రయోజనార్థం కొంత మాట్లాడుకుందాం. విద్యతో ప్రతిభ, ప్రతిభతో ఉపాధి, ఉపాధిలో నైపుణ్యం, నైపుణ్యంతో ఆవిష్కరణలు, ఆవిష్కరణలతో ఉత్పాదకత, ఉత్పాదకతతో అభివృద్ధి. ఇది ఇవాళ్టి డిజిటల్ యుగపు విద్యావ్యవస్థ ముందున్న సమున్నత గమ్యం.
‘Science and innovation are recognised internation ally as key for boosting productivity, creating more and better jobs, enhancing competitiveness and growing an economy. –Dr. Alan Finkle, Australia’s Chief Scientist
There are so many exciting career paths in STEM. My STEM career path has enabled me to combine my passion for the marine environment with cutting edge technology for whale conservation‘ –VANESSA PIROTTA, Ph.D Student
Studying STEM is the opportunity to be able to try to grasp the dynamic world that lies all around us. It gives us the chance to participate in the world wide initiative to attempt to understand the universe in all of its complexity. –WAYNE CAETHORNE, Bio Chemistry Student
ప్రపంచ వ్యాప్తంగా విద్యా బోధనను విప్లవాత్మకంగా మారుస్తున్న విధానమే ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్స్ (STEM) సమీకృత అధ్యయనం. విద్యను ఏకీకృతం చేయడానికి సంబంధించిన తాత్విక బోధనా నమూనా ఇది. STEM తన 30 సంవత్సరాల వేడుకలకు సిద్ధమవుతోంది. యుఎస్‌ఎ, గ్రేట్ బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని ప్రధాన దేశాలలో పటిష్ఠంగా అమలవుతూ ఇప్పుడిప్పుడే ఇండియాలో విస్తరిస్తున్న స్టెమ్‌ను గురించి విద్యార్థుల ప్రయోజనార్థం కొంత మాట్లాడుకుందాం. విద్యతో ప్రతిభ, ప్రతిభతో ఉపాధి, ఉపాధిలో నైపుణ్యం, నైపుణ్యంతో ఆవిష్కరణలు, ఆవిష్కరణలతో ఉత్పాదకత, ఉత్పాదకతతో అభివృద్ధి. ఇది ఇవాళ్టి డిజిటల్ యుగపు విద్యావ్యవస్థ ముందున్న సమున్నత గమ్యం. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదించబడిందే ‘స్టెమ్’ శిక్షణ.
ఆర్థిక వ్యవస్థల మనుగడ కూడా ఈ శిక్షణతో ముడిపడివుంది. ఆర్థిక ప్రతిపత్తి గురించే కాకుండా పౌర సమాజపు జీవితాన్ని మెరుగుపరచే నైపుణ్యాలను బోధించడంపై కూడా స్టెమ్ దృష్టి పెడుతుంది. జీవన వాస్తవాలను గుర్తెరిగి ప్రాపంచిక సమస్యలను అవగాహనకు తెచ్చుకొని శీఘ్ర పరిష్కరానికి అవసరమైన ఆలోచనా విధానాన్ని విద్యార్థులకు నేర్పించాలనేది స్టెమ్ బృహత్ సంకల్పం. ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో మూడు దశాబ్దాల క్రితమే స్టెమ్ నిర్దేశిత బోధన ఆరంభమైంది. అక్కడి అనుభవాల మీదనే స్టెమ్ ను యావత్ప్రపంచ దేశాలు తమతమ విద్యా కార్యక్రమాలనికి జోడించాలని నిపుణులు కోరుతున్నారు.
‘సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం: స్టెమ్ విధానాన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టడం వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. విమర్శనాత్మకంగా ఆలోచిస్తారు. సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటారు. వయోజన జీవితం లో తమకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడానికి స్టెమ్ నిత్యం సహాయపడుతుంది. అయితే, స్టెమ్ అభ్యాసం తరగతి గదికే పరిమితం కానవసరం లేదు. రోజువారీ జీవితంలో స్టెమ్ సూత్రాలను అనుసరించడం వలన పిల్లలు సత్యాసత్యాలను -ప్రపంచంతో అనుసంధానించి అర్థం చేసుకోవచ్చును. అభ్యసనం సౌకర్యవంతంగా, విశ్వసనీయంగా ఉండటానికి స్టెమ్ ఒక గొప్ప మార్గం’ అంటూ పిల్లల మ్యాగజైన్ ‘లాస్ ఎంజిల్స్ పేరెంట్’ స్టెమ్ అనుసంధానం అవసరాన్ని ప్రత్యేకంగా పేర్కొంది. ‘విద్యలో స్టెమ్ ప్రాథమికంగా సృజనాత్మకమైన విభిన్న ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. అధునాతన సాంకేతికతలు, వినూత్న భావనలు కార్యరూపం దాల్చడానికి యువతకు ప్రేరణ కల్పిస్తుంది.
దీనిలో అభ్యాసగతమైన ఆవిష్కరణలపై దృష్టి సారించడంతోపాటు, విద్యార్థులు శోధన- ఆధారిత అసైన్‌మెంట్ల నుండి నేర్చుకుంటారు. విద్యకు సంబంధించి బలమైన సామాజిక తాత్త్వికత అవగాహనను అందిస్తూ జ్ఞానానువర్తనాన్ని ప్రోత్సహిస్తుంది’ అని ‘స్టడీ యుఎస్‌ఎ హయ్యర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ లిమిటెడ్’ చెబుతున్నది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం ఒకటి అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఉత్పత్తులు, వస్తువుల కోసం అతిపెద్ద దిగుమతిదారులలో కూడా భారతదేశం ఒకటి. మనం ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల నుండి దాదాపు 6000 ఉత్పత్తులు, వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. వాణిజ్య సమాచారాన్ని గమనిస్తే మన దేశం 2021లో ప్రపంచ వ్యాప్తంగా US $ 570.4 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. 2017లో దిగుమతులు 28.5% కాగా, 2021లో 55% నమోదైంది.
చమురుతో సహా ఖనిజ ఇంధనాలు: US $ 170.4 బిలియన్లు (మొత్తం దిగుమతులలో 29.9%) మొదలుకొని, రత్నాలు, విలువైన లోహాలు: $ 88.3 బిలియన్లు (15.5%), విద్యుత్ యంత్రాలు, పరికరాలు: $ 56.7 బిలియన్ (9.9%), కంప్యూటర్లతో సహా యంత్రాలు: $ 48.4 బిలియన్ (8.5%), సేంద్రీయ రసాయనాలు: $ 27.2 బిలియన్ (4.8%), ప్లాస్టిక్స్, ప్లాస్టిక్ వస్తువులు: $ 19.3 బిలియన్ (3.4%), జంతు/ కూరగాయల కొవ్వులు, నూనెలు, మైనపులు: $ 17.5 బిలియన్లు (3.1%), ఇనుము, ఉక్కు: $ 11.7 బిలియన్ (2%), ఆప్టికల్, టెక్నికల్, మెడికల్ ఉపకరణం: $ 11.3 బిలియన్ (2%), అకర్బన రసాయనాలు: $ 9.6 బిలియన్ (1.7%) వరకు సగటున ప్రతి ఏటా దిగుమతి చేసుకుంటున్నాం. నిజంగా మనమే కనుక ఆవిష్కరణల రంగంలో ముందుంటే ఇక్కడ పేర్కొన్న దిగుమతుల్లో దేని అవసరమూ మన దేశానికుండదు, పెద్ద ఎత్తున ద్రవ్యం వెచ్చించడమూ ఉండదు. దిగుమతుల నేపథ్యంలో కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా, సగటు మారకం రేటు ఆధారంగా 2021లో మన రూపాయి విలువ గతంలో కంటే అధికంగా పడిపోయింది. మున్ముందు పెరగనున్న జనాభాను అనుసరించి దిగుమతులు ఇంకా పెరగనున్నాయి, రూపాయి రేటు మరింతగా పడిపోనుంది.
దీనికి మౌలిక పరిష్కారం ఉత్పాదకతా విద్యే. అభివృద్ధి చెందిన దేశాలు 1990 నుండి తమ విద్యావరణాన్ని స్టెమ్‌తో మేళవించాయి. భావనగా 1989 -1991ల మధ్య STEM విద్యావేత్తల్లో అంకురించింది. ‘స్పే’ SHPE (సొసైటీ ఆఫ్ హిస్పానిక్ ప్రొఫెషనల్ ఇంజినీర్స్) జీవితకాల సభ్యుడు Charles E.Vela దీన్ని 1992లో విద్యా నమూనాగా రూపొందించగా, అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించబడింది. ప్రపంచ నలుమూల్లో ఇప్పటి దాకా అమలులో ఉన్న అభ్యసన పద్ధతుల్లో మేలైందిగా ప్రశంసలందుకుటున్న దరిమిలా విద్యావేత్తలు, విద్యాసంస్థలు, విద్యార్థులు స్టెమ్ ద్వారా మేధోరంగానికి పది ప్రత్యేక ప్రయోజనాలున్నాయని ముక్త కంఠంతో చెబుతున్నారు.
అవి 1. సృజనాత్మకత పెంపొందుతుంది. ( Impro ves creativity), 2. భాగస్వామ్యం ద్విగుణీకృతం కాగలదు (Increases team collaboration), 3. అభివ్యక్తీకరణ నైపుణ్యాల సమృద్ధి (Develops communica tion skills), 4. విమర్శనాత్మక దృష్టి ప్రబలం కాగలదు (Empowers critical thinking skills), 5. కుతూహలానికి ప్రోత్సహం (Boosts curiosity) 6. అభిజ్ఞా సామర్థ్యం అభివృద్ధి చెందగలదు (Improves cognitive skills), 7. సత్వర వృత్తి నిర్దేశం Introduces STEM careers at early ages), 8. అధ్యాపకుల కార్యాచరణను సైతం ప్రభావితం చేయగలదు (Teaches how to take initiative), 9. ప్రసార మాధ్యమ అభినివేశ కల్పన (Enhances media literacy), 10. సామాజికోద్వేగ అభ్యసనం మీద మరింత ఇష్టం ఏర్పడగలదు (Boosts social-emotional learning). చాలామటుకు పిల్లలకు ఎనమిదేళ్ల వయస్సులో సాంకేతికతపై ఆసక్తి ఏర్పడుతుంది. సాంకేతికతా వినియోగదారు నుండి ఆవిష్కర్తగా మారడం పిల్లల్లో చాలా అరుదుగా జరిగే ప్రక్రియ.
మన విద్యా విధానపు రోట్ లెర్నింగ్‌ను అధిగమించి విభిన్న ఆలోచనలను ప్రయోగాలుగా నిర్వహించేందుకు అరుదైన అవకాశాన్ని స్టెమ్ సద్వినియోగ పరచగలదని నిపుణుల అభిప్రాయం. నాసా పరిశోధకులు చెబుతున్నట్టు పిల్లలు జన్మతః 98% మంది మేధావులు, ఆ తర్వాత పరిసరాలు వాళ్లను మొద్దులుగా మార్చేస్తాయని, దానితో మేధావుల సంఖ్య 2 శాతానికి దారుణంగా పడిపోతుంది. మరి పిల్లల నిరంతరాయ మేధోద్ధరణకు మార్గమేది? అనే ప్రశ్నకు స్టెమ్ మాత్రమే ఇప్పుడు ఉపశమనం, జవాబు. చివరగా స్టెమ్ గురించి ఒక చిన్నమాట. ‘STEM is not just a subject at school, it’s a way of thinking and doing, and an important skill set that could see your generation working together to solve some of the world’s greatest challenges’ అనే విషయం అందరికీ స్పష్టంగా తెలిసుండాలి.