Monday, December 23, 2024

ఆచితూచి అడుగులు

- Advertisement -
- Advertisement -

అటు ఢిల్లీతో.. ఇటు సీనియర్లతో సిఎం రేవంత్ సామరస్య ధోరణి

మన తెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్లమెంటు ఎ న్నికలు సమీపిస్తున్న వేళ మరింత జాగ్రత్తగా పా ర్టీ, ప్రభుత్వ వ్యవహారాలను సామరస్య పూర్వక ధోరణిలో నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహజ సిద్ధంగా ఉండే ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌కు భిన్నంగా పూర్తి సంయమనంతో పార్టీని, పాలన ను వివాద రహితంగా ముందుకు నడిపిస్తున్నా రు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 50 రోజులైనా ఎలాంటి తీవ్ర వివాదాలు చోటు చేసుకోలేదు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో, ఢిల్లీ హై కమాండ్‌తో, రాష్ట్రంలో సీనియర్లతో చివరకు గవర్నర్ తమిళిసైతో కూడా సయోధ్య ధోరణిలో తాను అనుకున్న నిర్ణయాలను అమలు చేయగలుగుతున్నారు. సాధారణంగా, కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఎన్నో వివాదాలు, అపోహలు, అనుమానాలు తెరపైకి వస్తుంటాయి.

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో రెండు నెలలలోపే ఎన్నో సమస్యలు ఆ పార్టీని చుట్టుముట్టాయి. కాంగ్రెస్ ఢిల్లీ నేతలు బెంగళూరుకు వచ్చి సమస్యలు సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సి వచ్చింది. కానీ అలాంటి వివాదాలు ఇక్కడ చోటు చేసుకోకుండా తానే అన్ని విషయాల ను చక్కదిద్దుతున్నారు. అరకొర మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని వివాద రహితంగా ముందుకు సాగించడం సాధారణమైన విషయం కాదు. ఏ ప్రభుత్వానికైనా ఐఎఎస్,ఐపిఎస్, దిగువస్ధాయి పోలీసు అధికారుల పోస్టింగ్‌లు, పదోన్నతులు, భూముల వివాదాలు లాంటివి విమర్శలకు తావిస్తాయి. కానీ రేవంత్‌రెడ్డి ఐఏఎస్, ఐపిఎస్ దిగువ స్థాయి పోలీస్ అధికారుల పోస్టింగులలో రాజకీయ ప్రమేయం లే కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, రే వంత్ రెడ్డి అధికారుల పనితీరు, నిజాయితీ, ప్రతి భ ఆధారంగా కీలక పోస్టులు భర్తీ చేస్తున్నారు. కీలక శాఖలకు ఐఎఎస్ ఐపిఎస్‌లను వివాద రహితంగా నియమిస్తున్నారు.

గత ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టిన టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా కెసిఆర్ ప్రభుత్వంలో డిజిపిగా పనిచేసిన మహేందర్‌రెడ్డిని నియమించారు. ఆయన గత ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్నా పనితీరు ఆధారంగా కీలక పోస్టులో నియమించారు. ప్రభుత్వంలో మంచి పనితీరు, ప్రతిభను ఎవరు ప్రదర్శించిన వారిని రాజకీయాలకు అతీతంగా నియమిస్తామనే సందేశాన్ని మహేందర్‌రెడ్డి నియామకం ద్వారా ఇచ్చారు. కీలక పోస్టుల్లోకి ఎవరిని తీసుకుంటున్నా ముందే వారి చరిత్రను వివిధ వర్గాల ద్వారా సేకరించి క్లీన్ రికార్డు ఉంటేనే పోస్టులు ఇస్తున్నారు. జిల్లాల్లో డిఎస్‌పి పోస్టింగుల్లో భారీగా రాజకీయ ఒత్తిడులు ఉంటాయి. ఎంఎల్‌ఎలు, మంత్రులు సిఫారసు చేస్తే పోస్టింగ్‌లు ఇచ్చేవారు, కానీ రేవంత్‌రెడ్డి ఈ రివర్స్ చేశారు. రాజకీయ ఒత్తిడులకు అతీతంగా సీనియర్లతో సంప్రదించి వివిధ వర్గాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పోస్టింగులు ఇవ్వడం సరికొత్త పరిణామంగాఈ చెప్పవచ్చు. పోస్టింగ్‌ల తరువాత ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవి భూముల డీలింగ్స్, ఇలాంటి ల్యాండ్ లిటిగేషన్ల దరిదాపులకు తాను వెళ్లకుండా మిగతా వారిని కూడా దూరంగా ఉండమని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక విధానపరమైన నిర్ణయాల విషయాల్లో కూడా ఆయన తొందరపాటు ప్రదర్శించడం లేదు. ఖజానా వెక్కిరిస్తున్నా వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులతోనే ప్రజలకు, వివిధ వర్గాలకు ఉపయోగపడేలా నిధులు విడుదలయ్యేలా చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో నెల జీతాలు చాలా ఆలస్యంగా వచ్చేవి. ఫలితంగా ఉద్యోగులు ఇఎంఐ దెబ్బకు హడలెత్తిపోయారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పడులేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం బాగా ఇబ్బంది పడ్డారు.దీంతో సిఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైన నెల జీతాలను సకాలంలో ఇవ్వడానికి ఆయన ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో పడేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశిస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లు ఒక మంత్రి ద్వారా తమ పాత పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు ఒత్తిడి తెచ్చినా ఆయన ఉద్యోగుల జీతాలు, రైతుల పెట్టుబడి సాయం గురించే ప్రాధాన్యత ఇవ్వడం అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తున్నది.

ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఆయనపై భారీగా ఒత్తిడులు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక ముఖ్య నాయకుడికి ఎంఎల్‌సి పదవి దాదాపుగా ఖరారైన తరుణంలో అదే జిల్లాకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేత హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చి ఆనేతకు పదవి రాకుండా అడ్డుకున్నారు. అయినా రేవంత్ రెడ్డి పెదవి విప్పలేదు, మౌనాన్ని పాటించారు. ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ తమిళిసై అంగీకరించేలా చేయడంలో ఆయన అంతులేని లౌక్యాన్ని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో తమిళిసై ప్రభుత్వ ప్రతిపాదనలు అనేకం పెండింగ్‌లో పెట్టారు. పెను వివాదం సృష్టించారు. ఇది గుణపాఠంగా రేవంత్‌రెడ్డి గవర్నర్ తమిళిసైతో గౌరవపూర్వక సంబంధాలు కొనసాగించి ఎంఎల్‌సిలుగా ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎంపిక సులభమయ్యేలా సఫలీకృతమయ్యారు. కేంద్రంతో కూడా ఘర్షణ పూరిత వైఖరి కాకుండా సయోధ్యతో వ్యవహరిస్తూ మెహదీపట్నంలో ప్రధాన సమస్యగా ఉన్న స్కైవాక్ నిర్మాణానికి ప్రధాన ఆటంకంగా ఉన్న రక్షణ శాఖ భూములను అప్పగించేలా చేయడంలో విజయవంతమయ్యారు. మెట్రో రెండో దశ విస్తరణలోనూ ఆయన రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేయలేదు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే నగర మధ్య ప్రాంతం నుంచి ఎయిర్‌పోర్టు వరకు విస్తరణ జరిగేలా ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. అలాగే కోర్‌సిటీ రూపురేఖలు మార్చే మూసీ సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తూ దావోస్‌లో పెట్టబడులను ఆహ్వానించారు. ఇరువైపులా 55 కిలోమీటర్ల పొడవునా ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండా అభివృద్ధి జరిగేలా ఆయన చూస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలు జరిగే ఏప్రిల్‌లోపు, ఎన్నికల కోడ్ వచ్చేలోపు మరికొన్ని హామీలు అమలు చేయడం ద్వారా ప్రజల విశ్వాసం కాంగ్రెస్‌పై చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా ‘మహాలక్ష్మి’ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ. 500లకే వంటగ్యాస్, మహిళలకు నెలకు రూ.2500 సాయం అందించడం ద్వారా వారి మనసులో కాంగ్రెస్‌కు సుస్థిర స్థానాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఆర్థిక సాధ్యాసాధ్యాలను కూడా అధ్యయనం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చూపిన అభిమానం కాంగ్రెస్‌పై లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగడానికి అవసరమైన ముందస్తు వ్యూహాలను ఆయన రచిస్తున్నారు. ఒకవైపు విపక్షాలకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తూనే మరోవైపు సీనియర్లు అసమ్మతి స్వరాలు వినిపించకుండా కాంగ్రెస్ పార్టీ సరికొత్త సంస్కృతిని తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News