Sunday, January 19, 2025

భోజనంలో విషం పెట్టిన సవతి తల్లి

- Advertisement -
- Advertisement -

రాంచీ: మొదటి భార్య పిల్లలకు భోజనంలో సవతి తల్లి విషం పెట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లాలో జరిగింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రోహంతాండ్ సునీల్ సోరైన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం మొదటి భార్యను పాము కరవడంతో చనిపోయింది. అతడి ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికి సునీత అనే మహిళను అతడు పెళ్లి చేసుకున్నాడు. సునీల్ ఉపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లడంతో పిల్లలు సవతి తల్లి దగ్గర ఉంటున్నారు. బుధవారం సవతి తల్లి పిల్లలకు చికెన్ వండి పెట్టింది. చికెన్‌లో విషం కలిపి ముగ్గురికి భోజనం పెట్టింది. ముగ్గురు వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో సవతి తల్లి అక్కడ నుంచి పారిపోయింది. స్థానికులు వెంటనే ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అనిల్ మృతి చెందగా మిగితా ఇద్దరు శంకర్, విజయ్ చావు బతుకుల కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News