Sunday, December 22, 2024

టీనేజ్ కూతురు పై సవతి తండ్రి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

యుక్త వయసులో ఉన్న కుమార్తెపై తల్లిదండ్రులే అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అపరిచితుల కన్నా తమతో శృందారమే సురక్షితమన్న సాకుతో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆమె తల్లిదండ్రులను యూటా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. బలవంతపు లైంగిక దాడికి ప్పాడ్డారన్న అభియోగాలపై 30వ పడిలో ఉన్న బాధఙతురాలి సవతి తండ్రి, సొంత తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వివరాల గోప్యత కోసం ఆమె తల్లిదండ్రుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. గడచిన ఏడాదిన్నర కాలంగా బాలికపై ఆమె సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఈ విషయం ఆమె తల్లికి కూడా తెలుసునని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అపరిచితులతో లైంగిక కార్యకలాపాలు సాగించాలని తమ కుమార్తె కోరుకుంటోందని తనకు, తన భార్యకు(బాధితురాలి తల్లి) తెలిసిందని ఆమె సవతి తండ్రి పోలీసలుకు తెలిపాడు.

అపరిచితులతో లైంగిక కార్యకపాలు సాగించే కన్నా తామే బాధితురాలికి వాటి గురించి బోధించాలని తాను, ఆమె తల్లి నిర్ణయించుకున్నామని అతను చెప్పాడు. 14 ఏళ్ల వయసులో ఉన్నపుడు బాధితురాలు శృంగారాన్ని కోరుకుంటోందని ఆమె తల్లిదండ్రులు తెలుసుకున్నారను. బాలిక వద్ద ఆన్‌లైన్ చాట్లు, అసభ్యకర భంగిమలో ఉన్న బాలిక ఫోటోలను ఆమె తల్లి చూసింది. సెక్స్ టాయ్స్‌ను తెచ్చి వాటిని ఎలా ఉపయోగించాలో ఆ బాలికకు వాళ్లిద్దరూ చూపించారు. తాను, తన భర్త శృంగారం చేస్తుంటే తన కుమార్తె అక్కడే కూర్చుని చూసిందని, అంతకుమిఒంచి ఏమీ జరగలేదని బాధితురాలి తల్లి పోలీసులకు తెలిపింది. రెండు నెలల క్రితం తన కుమార్తె చినిగిపోయిన కండోమ్‌ను తెచ్చి తనకు చూపిందని, తన భర్తను దీని గురించి ప్రశ్నిస్తే తాను బాధితురాలితో సంపూర్ణంగా శృంగారంలో పాల్గొనలేదని చెప్పాడని ఆమె పోలీసులకు తెలిపింది. బాధితురాలి తల్లిదండ్రులపై యూటా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News