Thursday, December 26, 2024

కూతురిపై సవతి తండ్రి లైంగికదాడి..వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

జగద్గిరిగుట్ట ః- లైంగికదాడికి యత్నించిన సవతి తండ్రి పై కూతురు తనను తాను కాపాడుకునేందుకు దాడి చేసిన సంఘటనలో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన జయశ్రీనాయక్ అనే మహిళ గత 30 ఏండ్ల కిందట ఓ వ్యక్తితో వివాహం అయింది. వీరికి దంపతులకు నలుగురు సంతానం. అయితే గత ఎనిమిదేళ్ల కిందట కుటుంబ కలహలతో ఇద్దరు విడిపోయారు. అప్పటి నుండి నలుగురు పిల్లలు తండ్రి వద్దనే ఉంటున్నారు. అప్పటి నుండి జయశ్రీనాయక్ మహిళ పద్మనాభనాయక్ వ్యక్తితో సహజీవనంతో గడుపుతుంది. వీరిద్దరు గత ఏడాది కిందట నగరానికి వలస వచ్చారు .

ఎనిమిదేళ్ల కిందట నగర శివారు కండ్లకోయ జీవికె ఈఎంఆర్ ఐలో పని చేసుకుంటూ అక్కడే ఓ రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. గత మూడు నెలల క్రితం జయశ్రీ నాయక్ కూతురు(17) తల్లి ఉంటున్న ప్రాంతానికి వచ్చింది. ఈ క్రమంలో సవతి తండ్రి చేష్టలు నచ్చేవి కాదు. పలుమార్లు హెచ్చరించింది. అయినా తీరు మారకపోవడంతో ఈ నెల 8న మధ్యాహ్నం సమయంలో జయశ్రీ నాయక్ డ్యూటీకి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురు వద్దకు పద్మనాభనాయక్ పుల్ గా మద్యం సేవించి వచ్చి లైంగికదాడికి యత్నించాడు. ఈ క్రమంలో పుష్పాంజలి తనకు తాను రక్షించికునేందుకు కర్రతో తలపై దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే పడిపోవడంతో మధ్యాహ్నాం భోజనానికి ఇంటికి వచ్చిన జయశ్రీ నాయక్ కు తన కూతురు జరిగిన విషయం చెప్పుకుంది. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7.30 గంటలకు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News