Tuesday, March 18, 2025

ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం: నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రభుత్వ వర్శిటీల్లో పరిపాలనకు యూనిఫైడ్ చట్టం తీసుకొస్తామని ఎపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు వర్శిటీల ఏర్పాటుపై శాసన మండలిలో చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు నారా లోకేష్ సమాధాన మిచ్చారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని అన్నారు. అమరావతికి వచ్చేందుకు బిట్స్ సిద్ధంగా ఉందని, త్వరలో డీప్ టెక్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని చెప్పారు. విశాఖలో ఎఐ వర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం పిజికి ఫీజు రీయింబెర్స్ మెంట్ ను తొలగించిందని తెలియజేశారు. పిజికి ఫీజు రీయింబెర్స్ మెంట్ ఇచ్చేందుకు చర్యలు
తీసుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News