Thursday, January 23, 2025

పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పెన్షనర్లకు కూడా నగదు రహిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) పథకం ద్వారా వెంటనే నగదురహిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆ సంఘం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 33 జిల్లా శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈ సమావేశానికి రాష్ట్ర సెక్రటరీ జనరల్ సి. చంద్రశేఖర్ పెన్షనర్లకు సంబంధించి ప్రధాన కార్యదర్శి నివేదికను ఈ సమావేశంలో ప్రవేశ పెట్టారు. అనంతరం రాష్ట్ర కోశాధికారి ఎ. గంగారెడ్డి ఆర్థిక నివేదికను సమర్పించిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పెన్షనర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘానికి వెంటనే ప్రభుత్వ గుర్తింపు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సంఘానికి రాష్ట్ర రాజధాని పరిసరాల్లో స్థలం కేటాయించి భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వనాథం, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News