Thursday, January 23, 2025

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులు, తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశం హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా 230 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో ఆసరా పెన్షన్‌కు సంబంధించి 12 దరఖాస్తులు, భూ సమస్యలపై 183 దరఖాస్తులు, భూ సర్వేకు సంబంధి ంచి దరఖాస్తులు, ఇతర సమస్యలపై 35 దరఖాస్తు లు వచ్చాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలో దరఖాస్తులు పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మీ సేవలో సక్సెషన్ కింద దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై ఫిర్యాదులను పరిశీలించి ఆయా మండలాల తహసీల్దార్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ , ఆర్డీఓ రాములు, ఏఓ యాదగిరి, తహసీల్దార్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News