Monday, December 23, 2024

ప్రజా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి : ప్రజ ల నుండి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సోమవారం నూతన ఐడిఓసి సమావేశం హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి సందర్భంగా వివి ధ సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు.

ధరణి సమస్యలపై, వికలాంగులు, వితంతువులు, వృద్దాప్య పింఛన్లపై మొత్తం 76 ఫిర్యాదులు అందాయని, ధరణికి సంబంధించినవి 69, ఫెన్షన్ 5 దరఖాస్తులు, వివిధ సమస్యలపై 2 వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి వెంట నే పరిష్కరామయ్యేలా చూడాలని అధికారులకు తెలిపారు.

ప్రజా ఫిర్యాదులను జిల్లా అధికారులు సం బంధిత మండలాల తహసీల్దార్లు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌లు, అపూర్వ చౌహన్ , చీర్ల శ్రీనివాస్, ఆర్డీఓ చంద్రకళ, సుబ్రహ్మణ్యం తహసీల్దార్ సుభాష్ , ఏఓ బ్రదప్ప, జిల్లా అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News