Friday, December 20, 2024

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ హరీశ్

రంగారెడ్డి జిల్లా: భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్‌బి నగర్ నియోజకవర్గ ంలో జి.ఓ. 58,59, 118 వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని, పేద, మధ్య తరగతి కుటుంబాల వారు దరఖాస్తు చేసుకున్నారని వారికి అన్యాయం జరగకు ండా, సమస్యలను పరిష్కరించాలని, నియోజక వర్గంలో ఉన్న మిగతా సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలను తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్బంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో జి.ఓ. 58,59,118 వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యల ను చేపడతామని, ఎవరికి అన్యాయం జరగకుండా పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ తిరుపతిరావు, ఆర్డీఓలు వెంకటాచారి, సూరజ్, తహసిల్దారులు జయశ్రీ, సంధ్యా, ఎడి సర్వే ల్యాండ్ శ్రీనివాస్, పరిశ్రమల జి.ఏం. రాజేశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News