Friday, November 15, 2024

మౌలిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: పోచారం సద్‌భవన్ టౌన్ షిప్‌లో మౌలిక సమస్యల పరిష్కారినికి అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశించారు. పోచారం మున్సిపాలిటీ పరిధి సద్‌భవన్ టౌన్ షిప్‌లో మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డితో కలసి శనివారం పర్యటించి స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్లాట్ యజమానులు ఒకొక్కరి వద్ద నుంచి రూ. 50 వేల చొప్పున వసులు చేసిన దాదాపు రూ.4 కోట్ల నిధులతో సత్వరమే మౌలిక సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వారం లోగా ప్రణాళిక చేసి పనులు ప్రారంభించుకోవాలని, మిగిలిన ప్లాట్లు వచ్చే నెల వరకు విక్రయించడానికి అధికారులు చర్యలు తీసుకుంటుందని, తదనంతరం వారు చేయాల్సిన పనులు వారు చేస్తారని తెలిపారు. ఇక్క సూపర్ మార్కెట్, కమ్యూనిటీ భవనం, పాఠశాల, పార్కు తదితర వసతుల కోసం అసోసియేషన్ సభ్యులు అధికారులకు లేఖ ఇవ్వాలని, అట్టి పనులు చేసేవిధంగా నేను కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సామల శ్రీలత బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి, బాలగోని వెంకటేష్ గౌడ్, బెజ్జంకి హరిప్రసాద్ రావు, కో ఆప్షన్ సభ్యులు అక్రమ్ ఆలీ, దాసరి శంకర్, మున్సిపల్ మేనేజర్ నర్సింలు, రైతు బంధు సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మందడి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ళ బాలేష్, నాయకులు సామల బుచ్చిరెడ్డి, నర్రి కాశయ్య, అబ్బవతి నర్సింహా, మోటుపల్లి శ్రీనివాస్, బద్దం జగన్ మోహన్‌రెడ్డి, టౌన్ షిప్ అసోసియేషన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News