Monday, December 23, 2024

ప్రజావాణి సమస్యలపై అలసత్వం వహించొద్దు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ప్రజావాణి సమస్యలపై అలసత్వం వహించొద్దని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జిదారుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు వేగవంతం చేయాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజలు, అర్జిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించాలని అన్నారు. ప్రజవాణి విధుల పట్ల నిర్లక్షం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజావాణిలో 284 ఫిర్యాదులు అందాయని, అందులో రెవెన్యూ శాఖ ధరణికి సంబంధించి 242, జిల్లా పంచాయతి కార్యాలయం, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటి, బిసి, ఎస్సి సంక్షేమ శాఖలు, డిఈఓ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖల కార్యాలయాలకు చెందిన 42 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ధరణి ఫిర్యాదుల్లో అన్ని సక్రమంగా ఉన్న ఫిర్యాదులను ఆయన నేరుగా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి నర్సింగ్ రావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News