ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై అతను తన జట్టుకు దూరంగా ఉండనున్నాడు. అయితే అది కేవలం వన్డే ఫార్మాట్‌లోనే. వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు స్మిత్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో స్మిత్ 73 పరుగులు చేసినప్పటికీ.. ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ తర్వాత వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు స్మిత్ వెల్లడించాడు.
35 సంవత్సరాల స్మిత్ తన కెరీర్‌లో 170 వన్డేలు ఆడాడు. అందులో 43.28 సగటుతో, 86.96 స్ట్రైక్ రేటుతో 5800 పరుగులు చేశాడు. వన్డేల్లో మొత్తం 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు సాధించిన స్మిత్ ఆస్ట్రేలియా జట్టులో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 12వ ఆటగాడిగా తన కెరీర్‌ను ముగించాడు. స్మిత్ కెరీర్‌లో 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో 164 పరుగులు అత్యధిక స్కోర్. అంతేకాక.. కెరీర్ ఆరంభంలో లెగ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన స్మిత్ 28 వికెట్లు, ఫీల్డర్‌గా 90 క్యాచ్‌లు అందుకున్నాడు. వన్డేల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన స్మిత్ టి-20లు, టెస్ట్‌లకు జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.
కాగా, స్మిత్ మైఖెల్ క్లార్క్ తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఆడిన 64 మ్యాచుల్లో 32 మ్యాచుల్లో జట్టు విజయం సాధించగా.. 28 మ్యాచుల్లో ఓటమి పాలైంది. నాలుగు మ్యాచులు ఫలితం తేలలేదు. 2015, 2023లోె ప్రపంచకప్ గెలిచిన జట్టులో స్మిత్ సభ్యుడుగా ఉన్నాడు.