సిడ్నీ: భారత్‌తో జరిగిన మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పెను వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో ఒకసారి బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురైనా కూడా స్మిత్ తన పద్ధతిని మార్చుకోలేదు. తాజాగా భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్మిత్ తన దుర్బుద్ధిని మరోసారి ప్రదర్శించాడు. భారత బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తన బ్యాటింగ్‌కు అనువుగా క్రీజులో చేసుకున్న గార్డ్ మార్క్‌ను స్మిత్ చెరిపేశాడు. దీనికి సంబంధించిన వీడియో భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదిలావుండగా ఈ చర్యకు పాల్పడిన స్మిత్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఒకసారి నిషేధానికి గురైనా స్మిత్ బుద్ధి తెచ్చుకోలేదని అభిమానులు స్మిత్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.
Tried all tricks including Steve Smith trying to remove Pant's batting guard marks from the crease. Par kuch kaam na aaya. Khaaya peeya kuch nahi, glass toda barana.
But I am so so proud of the effort of the Indian team today. Seena chonda ho gaya yaar. pic.twitter.com/IfttxRXHeM— Virender Sehwag (@virendersehwag) January 11, 2021
Steve Smith Cheating in Sydney Test