Wednesday, January 22, 2025

అంతర్జాతీయ క్రికెట్‌కు స్టీవెన్ ఫిన్ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

లండన్ : ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ క్రికెట్ అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ పలికాడు. మోకాలి గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరంగా ఉంటున్న ఫిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘గతేడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, దానితో శారీరకంగా పోరాటం చేస్తూ ఓడిపోయానని, అందుకే ఈ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకూ 36 టెస్టులు ఆడాను. ఇది నేను కలలుకన్న దానికంటే చాలా ఎక్కువ’ అని ఫిన్ తెలిపాడు.

2005లో కౌంటీల్లో మిడిల్‌సెక్స్ తరఫున ఫిన్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇంగ్లండ్ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్లు తీసుకుని రికార్డ్ సృష్టించాడు. ఇక, 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టీవెన్ ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ జట్టులో ఆటగాడిగా ఉన్నాడు. 2011లో వన్డే క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన స్టీవెన్ ఫిన్ 69 వన్డేల్లో 102 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్లు తీసుకోగా.. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్ 27 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో స్టీవెన్ ఫిన్ ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

నెల రోజుల వ్యవధిలో నలుగురు..
నెల రోజుల వ్యవధిలోనే ఇంగ్లండ్ జట్టుకు నలుగురు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం పూడ్చలేని లోటు ఏర్పడింది. ఇటీవలె ముగిసిన యాషెస్ సిరీస్ సందర్భంగా తొలుత స్టువర్ట్ బ్రాడ్, ఆ తర్వాత మొయిన్ అలీ, అలెక్స్ హేల్స్, తాజాగా ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో ఇంగ్లండ్ క్రికెట్ అయోమయంతో పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News