Sunday, December 22, 2024

15 ఏళ్ళుగా అంధకారంలోనే గ్రామం..

- Advertisement -
- Advertisement -

చర్ల:మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆదివాసీ గ్రామం ఏర్పడి దాదాపు 15 ఏళ్లు గడుస్తోంది అయిన నేటికి విద్యుత్ సదుపాయం లేదు. దీంతో ఆ గ్రామస్తులు అంధకారంలోనే జీవనం సాగిస్తున్నారు. చీకటి పడితే చాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సుబ్బంపేట పంచాయతీ పరిధిలోని బిఎస్ రామయ్య నగర్ గ్రామంలో 40 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 300పైగా జనాభా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు.ఈ గ్రామ గిరిజనులకు విద్యుత్ సదుపాయం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అధికారులకు,పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకుండాపోయిందని వాపోతున్నారు.

పాలకులు,అధికారులు మారుతున్నప్పటికి తమ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని తెలుపుతున్నారు.తమ గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పించాలని తాము చేస్తున్న విన్నాపాలు అరణ్య రోదనలుగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ఎంతోమంది నాయకులు తమ గ్రామానికి వచ్చి ఇచ్చిన హమీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని అరోపిస్తున్నారు.సుబ్బంపేట గ్రామ పంచాయతీకి ఇంటి పన్నులు కూడా చెల్లించడం జరుగుతుందని తెలిపారు.అటవీశాఖ అధికారుల అభ్యంతరాల వల్లనే తమకు విద్యుత్ సౌకర్యం ఇవ్వడం లేదని గ్రామస్తులు అరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మా గ్రామం ఏర్పడి 15సంవత్సరాలు గడుస్తున్నప్పటికి,నేటికి విద్యుత్ సౌకర్యం లేదు.ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికి ఫలితం లేకుండాపోతోంది.భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేను కలసి తమ సమస్య మొరపెట్టుకున్న ఫలితం లేదు.ఓట్లు కాలంలో తమ చుట్టు తిరిగిన నాయకులు ఇప్పుడు మాత్రం తాము కనిపిస్తే మొఖం చాటేస్తున్నారు.
బిఎస్ రామయ్య నగర్,గ్రామస్తులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News