Thursday, January 9, 2025

ఈ వారం సానుకూలమే

- Advertisement -
- Advertisement -

పెరిగిన ఎఫ్‌పిఐ పెట్టుబడులు, ఉత్తమంగా క్యూ,  స్థూల ఆర్థిక గణాంకాలనూ గమనించాలి : నిపుణులు

ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్లు గతవారం ఒడిదుడుకులను చూశాయి. అయినప్పటికీ విదేశీ పెట్టుబడుల ప్రవాహం, మెరుగైన క్యూ4 ఫలితాలు, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు వెరసి ఈ వారం మార్కెట్లు ర్యాలీ బాటలోనే కొనసాగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం ఆర్‌బిఐ సమావేశం మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ గత వారంలో దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాలో డిఫాల్ట్ ముప్పు తప్పిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లలో ట్రెండ్ సానుకూలంగా మారింది. ఈ కారణంగా రాబోయే వా రం మార్కెట్‌కు మెరుగ్గా ఉంటుందని విశ్లేషకు లు అంచనా వేస్తున్నారు. మే నెల మొత్తంలో సెన్సెక్స్ 1,500 పాయింట్లు (2.5 శాతం) లాభపడి 62,547 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా ఈ కాలంలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ దాదాపు 470 పాయింట్లు (2.6 శాతం) లాభపడి 18,534 పాయింట్ల వద్ద నిలిచింది.

గ్లోబల్ ట్రెండ్

దేశీయ, అంతర్జాతీయ ట్రెండ్‌లతో పాటు స్థూల ఆర్థిక డేటా కూడా స్టాక్‌మార్కెట్ల దిశను నిర్ణయిస్తుంది. ఇది కాకుండా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కార్యకలాపాలు అంటే ఎఫ్‌పిఐ కూడా మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేస్తుంది. రుతుపవనాల పురోగతి మార్కెట్ కదలికపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం ధోరణి, ముడి చమురు ధరలపై కూడా పెట్టుబడిదారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

సేవల రంగం పిఎంఐ

ఈ వారంలో మొదటి రోజు సోమవారం సేవా రంగానికి సంబంధించిన పిఎంఐ గణాంకాలు విడుదలవుతాయి. ముందుగా తయారీ గణాంకాలు వస్తాయి. మే నెలలో దేశంలో ఫ్యాక్టరీ కార్యకలాపాలు 31 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సేవా రంగం పిఎంఐ డేటా కూడా సానుకూలంగా ఉంటే మార్కెట్‌కు దోహదం చేస్తుంది.

జిడిపి గణాంకాలు

జిడిపి గణాంకాలు గత వారం విడుదలయ్యాయి, ఇవి అంచనా కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇది మార్కెట్ ఊపందుకోవడానికి సహాయపడుతుంది. అమెరికాలో రుణ పరిమి తికి అనుమతితో డిఫాల్ట్ ముప్పు తప్పింది. అమెరికా పార్లమెంట్ రుణ పరిమితికి ఆమో దం తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లకు బలం చేకూరనుంది. అదే సమయంలో కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా బాగున్నాయి. ఈ విధం గా కొత్త వారం మార్కెట్‌కు అనుకూల వాతావరణంగా కనిపిస్తోంది.

నేటి నుంచి ఆర్‌బిఐ సమావేశం

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి) సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం జూన్ 6న ప్రారంభమవుతుంది. అయితే సమావేశంలోని నిర్ణయాలను జూన్ 8న వెల్లడిస్తారు. మార్కెట్ ఎంపిసి సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. ఆర్‌బిఐ ఎంపిసి సమావేశంలో ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచవచ్చని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News