Monday, January 20, 2025

స్టాక్ మార్కెట్‌లో తొమ్మిదో రోజూ బుల్ రన్!

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తొమ్మిదో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఎనిమిది రోజుల వరుస లాభాలను మదుపర్లు ఈ రోజు స్వీకరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం మన ఈక్విటీ మార్కెట్లు పనిచేయవు.

నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38.23 పాయింట్లు లేక 0.06 శాతం పెరిగి 60431.00 వద్ద ముగియగా, నిఫ్టీ 15.60 పాయింట్లు లేక 0.09 శాతం పెరిగి 17828.00 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఐషెర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్ లాభపడగా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సిఎల్ టెక్, టిసిఎస్ ప్రధానంగా నష్టపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి విలువ 0.24 పైసలు లేక 0.29 శాతం తగ్గి రూ. 81.85 వద్ద ముగిసింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం 264.00 రూపాయిలు లేక 0.44 శాతం పెరిగి 60892.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News